LOADING...
SBI Bank Closure: ఎస్బీఐ ఖాతాదారులకు భారీ షాక్.. రేపటి నుంచి వరుసగా 6 రోజులు సేవలకు అంతరాయం!
ఎస్బీఐ ఖాతాదారులకు భారీ షాక్.. రేపటి నుంచి వరుసగా 6 రోజులు సేవలకు అంతరాయం!

SBI Bank Closure: ఎస్బీఐ ఖాతాదారులకు భారీ షాక్.. రేపటి నుంచి వరుసగా 6 రోజులు సేవలకు అంతరాయం!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 22, 2026
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు కీలక హెచ్చరిక జారీ అయింది. బ్యాంకుకు సంబంధించిన ముఖ్యమైన పనులు ఉంటే ఇవాళే పూర్తి చేసుకోవాలని వినియోగదారులకు సూచనలు వెలువడుతున్నాయి. ఎందుకంటే మే 23 నుంచి మే 28 వరకు వరుసగా ఆరు రోజుల పాటు ఎస్బీఐ శాఖల కార్యకలాపాలు ప్రభావితమయ్యే అవకాశం కనిపిస్తోంది. వారాంతపు సెలవులు, ఉద్యోగుల ప్రతిపాదిత సమ్మె, అలాగే బక్రీద్ పండుగ సెలవులు కలిసి ఈ పరిస్థితికి కారణమవుతున్నాయి.

వివరాలు

మే 23 నుంచి 28 వరకు ఎందుకు బ్యాంకులు మూసివేత?

మే 23వ తేదీ నాలుగో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఆ తర్వాత మే 24 ఆదివారం కావడంతో సాధారణ వారాంతపు సెలవు అమల్లో ఉంటుంది. దీంతో వరుసగా రెండు రోజుల పాటు బ్యాంకు శాఖలు పనిచేయవు. ఇక మే 25, 26 తేదీలలో ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ (AISBISF) దేశవ్యాప్త రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చింది. ఉద్యోగుల పలు డిమాండ్ల సాధన కోసం ఈ సమ్మె చేపట్టనున్నట్లు సంఘం ప్రకటించింది. ఈ సమ్మె కారణంగా బ్యాంకింగ్ సేవలపై ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశం ఉంది.

వివరాలు

కొన్ని ప్రాంతాల్లో మే 28న కూడా సెలవు

అదే సమయంలో బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగ సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మే 27, 28 తేదీలలో వివిధ రాష్ట్రాలకు సెలవులు ప్రకటించింది. చాలా రాష్ట్రాల్లో మే 27న బ్యాంకులు మూసివేయబడతాయి. కొన్ని ప్రాంతాల్లో మే 28న కూడా సెలవు ఉంటుంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో మే 27, 28 రెండు రోజులూ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి.

Advertisement

వివరాలు

ఎస్‌బీఐ ఉద్యోగులు ఎందుకు సమ్మెకు దిగుతున్నారు?

AISBISF తమ 16 ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, మెరుగైన పని పరిస్థితులు, అలాగే వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడం ఈ సమ్మె ప్రధాన ఉద్దేశ్యమని సంఘం తెలిపింది. సమ్మె వల్ల ఏ సేవలు ప్రభావితమవుతాయి? ఈ సమ్మె ప్రధానంగా క్లర్కులు, ఇతర కార్మిక సిబ్బందికి సంబంధించినది కావడంతో చెక్కుల క్లియరింగ్, నగదు లావాదేవీలు, క్యాష్ కౌంటర్లు, పాస్‌బుక్ అప్‌డేట్లు వంటి సేవలు అంతరాయం కలగవచ్చు. శాఖల్లో సిబ్బంది కొరత ఏర్పడే అవకాశముండటంతో వినియోగదారులు ముందుగానే అవసరమైన పనులు పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.

Advertisement

వివరాలు

ఎస్బీఐ ఉద్యోగుల 16 కీలక డిమాండ్లు ఇవే

ఖాళీగా ఉన్న క్లాస్-IV (మెసెంజర్) పోస్టులకు వెంటనే శాశ్వత నియామకాలు చేపట్టాలి * శాఖల భద్రత కోసం తగిన సంఖ్యలో సాయుధ గార్డులను నియమించాలి NPS పరిధిలో ఉన్న ఉద్యోగులకు తమ పింఛన్ ఫండ్ మేనేజర్‌ను ఎంచుకునే అవకాశం కల్పించాలి 2019 తర్వాత నియమితులైన ఉద్యోగులకు ఇంటర్ సర్కిల్ ట్రాన్స్‌ఫర్ (ICT) అవకాశం ఇవ్వాలి శాశ్వత పనులను అవుట్‌సోర్సింగ్‌కు అప్పగించే విధానాన్ని నిలిపివేయాలి పెరుగుతున్న పనిభారం దృష్ట్యా తగినంత సిబ్బందిని నియమించాలి జీతాలు, ఇతర సౌకర్యాల్లో ఉన్న అసమానతలను తొలగించాలి కెరీర్ పురోగతి, పదోన్నతి విధానాలను సమీక్షించి మెరుగుపరచాలి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు 8వ స్తబ్దత పెంపు ప్రయోజనాలు అమలు చేయాలి

వివరాలు

వైద్యుల కన్సల్టేషన్ ఫీజులను సవరించాలి

మెడికల్ రీయింబర్స్‌మెంట్ విధానాన్ని మరింత సరళీకృతం చేయాలి పెన్షన్ లెక్కింపులో అన్ని అలవెన్సులను చేర్చాలి HRMS సాఫ్ట్‌వేర్‌లోని సాంకేతిక సమస్యలను పరిష్కరించాలి బ్యాంకు బోర్డులో ఉద్యోగి ప్రతినిధిని డైరెక్టర్‌గా నియమించే పాత విధానాన్ని పునరుద్ధరించాలి PF ట్రస్ట్‌లో ఉద్యోగి ప్రతినిధికి స్థానం కల్పించాలి క్రాస్ సెల్లింగ్ పేరుతో ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి వినియోగదారులకు అనవసర ఉత్పత్తులు విక్రయించే విధానాన్ని అరికట్టాలి ఈ నేపథ్యంలో SBI ఖాతాదారులు నగదు ఉపసంహరణలు, చెక్కుల క్లియరింగ్, ఇతర శాఖ సేవలకు సంబంధించిన పనులను ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement