LOADING...
Gold Rate Today: దీపావళి వేళ బిగ్ షాక్.. ఈసారి వేలల్లో పెరిగిన తులం బంగారం!
దీపావళి వేళ బిగ్ షాక్.. ఈసారి వేలల్లో పెరిగిన తులం బంగారం!

Gold Rate Today: దీపావళి వేళ బిగ్ షాక్.. ఈసారి వేలల్లో పెరిగిన తులం బంగారం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 30, 2025
12:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

2025 దసరా, దీపావళి పండుగల సందర్భంగా బంగారం కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్. పండుగ సీజన్‌లో పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. మునుపటి రోజులలో వందల రూపాయల మేర మాత్రమే పెరుగుతుండగా ఇప్పుడు వేలల్లో పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు బంగారం ధరల్లో పెద్ద మార్పులు కనిపించాయి. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,410 పెరగగా, ఈరోజు రూ.1,420 పెరిగింది. అలాగే 22 క్యారెట్లపై రూ.1,300 పెరుగుదల నమోదైంది. దీని ద్వారా పసిడి ధరలు ఆల్‌టైమ్ రికార్డులను సాధిస్తున్నాయి. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (సెప్టెంబర్ 30) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08,450గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,18,310గా నమోదైంది.

Details

వెండి ధరలు రూ.16వేలు పెరుగుదల

హైదరాబాద్ మార్కెట్‌లో కూడా ఇదే ధరలు కొనుగోలు అవుతున్నాయి. గతంలో తులం 50 వేలు మాత్రమే ఉండగా, ఇప్పుడు ధరలు లక్ష 20 వేలకు చేరాయి. నిపుణుల అంచనా ప్రకారం కొన్ని నెలల్లో బంగారం ధర రెండు లక్షల రూపాయలకు చేరవచ్చు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ 10 రోజుల్లో వెండి ధరల్లో 16 వేలు పెరుగుదల నమోదయింది. గత రెండు రోజులలో వరుసగా వేల రూపాయల పెరుగుదల చోటు చేసుకుంది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,51,000గా ఉంది.

 Details

వినియోగదారుల్లో కలవరం

తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర ఒక లక్ష 61 వేల రూపాయలుగా నమోదైంది. ధనతేరాస్, దీపావళి సీజన్‌లో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతాయి. ఈ సీజన్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్య జనాలకు కలవరాన్ని కలిగిస్తోంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, రూపాయి విలువ, ఫెడ్ వడ్డీ రేట్లు, కేంద్ర బ్యాంకుల బంగారం రిజర్వులు వంటి పలు కారణాల వల్ల గోల్డ్, సిల్వర్ రేట్స్ ప్రభావితమవుతాయని నిపుణులు సూచించారు.