LOADING...
SpaceX: స్పేస్‌ఎక్స్‌కు షాక్.. మూడు రోజుల్లో భారీగా కుప్పకూలిన షేర్లు!
స్పేస్‌ఎక్స్‌కు షాక్.. మూడు రోజుల్లో భారీగా కుప్పకూలిన షేర్లు!

SpaceX: స్పేస్‌ఎక్స్‌కు షాక్.. మూడు రోజుల్లో భారీగా కుప్పకూలిన షేర్లు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 23, 2026
11:47 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌లో ఐపీవో ఉత్సాహం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇటీవలే భారీ అంచనాల మధ్య స్టాక్ మార్కెట్లోకి వచ్చిన ఈ సంస్థ షేర్లు గత మూడు రోజులుగా వరుస పతనాన్ని చవిచూస్తున్నాయి. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువలో 600 బిలియన్ డాలర్లకుపైగా కోత పడినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. భారీ స్థాయిలో నిధుల సమీకరణ కోసం ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ బాండ్లను విక్రయించనున్నట్లు స్పేస్‌ఎక్స్ ప్రకటించిన తర్వాత ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. ఈ ప్రకటన అనంతరం పెద్ద ఎత్తున షేర్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా సోమవారం ఒక్కరోజే కంపెనీ షేర్ల విలువ 16 శాతం మేర క్షీణించడం గమనార్హం.

వివరాలు

ఒక్కో షేరు ధర 135 డాలర్లు

ప్రస్తుతం స్పేస్‌ఎక్స్ మార్కెట్ విలువ ఇంకా 2 ట్రిలియన్ డాలర్లకు పైగానే ఉన్నప్పటికీ, ఇటీవల నమోదైన భారీ పతనం పెట్టుబడిదారులను అప్రమత్తం చేసింది. ''ఈ షేర్లను పొందాలనుకున్న వారు ఇప్పటికే కొనుగోలు పూర్తి చేశారు. ఇప్పుడు మార్కెట్‌పై విక్రేతల ఆధిపత్యం పెరిగిందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రికార్డు స్థాయిలో 75 బిలియన్ డాలర్ల ఐపీవో లిస్టింగ్ తర్వాత స్పేస్‌ఎక్స్ షేర్లు భారీ ర్యాలీ చేశాయి. పబ్లిక్ ఇష్యూలో ఒక్కో షేరు ధర 135 డాలర్లుగా నిర్ణయించగా, కొద్ది రోజుల్లోనే వాటి విలువ దాదాపు 60 శాతం పెరిగింది.

వివరాలు

పెరిగిన అమ్మకాల ఒత్తిడి

అయితే కంపెనీ 20 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కథనాలు వెలువడటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో షేర్లపై అమ్మకాల ఒత్తిడి పెరిగి ధరలు వరుసగా పడిపోతున్నాయి. అన్ని ఒడిదుడుకుల మధ్య కూడా స్పేస్‌ఎక్స్ ప్రస్తుతం మార్కెట్ విలువ పరంగా ప్రపంచంలోని ఆరో అతిపెద్ద కంపెనీగా కొనసాగుతోంది.

Advertisement