Boeing: ఈథియోపియా విమాన ప్రమాద బాధితురాలి కుటుంబానికి $35 మిలియన్ పరిహారం.. బోయింగ్‌కు కోర్టు ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని చికాగో ఫెడరల్ కోర్టు, 2019లో ఈథియోపియా ఎయిర్‌లైన్స్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఐక్యరాజ్య సమితి కన్సల్టెంట్ శిఖా గార్గ్ కుటుంబానికి బోయింగ్ కంపెనీ 35 మిలియన్ డాలర్లకు పైగా పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పు బుధవారం వెలువడింది. ఈ ఘటనలో 157 మంది మృతిచెందగా, ఇది ఆ ప్రమాదానికి సంబంధించి మొదటి సివిల్ కేసుగా నిలిచింది. వారం రోజులపాటు సాగిన విచారణ అనంతరం జ్యూరీ కేవలం రెండు గంటల్లో తీర్పు ఇచ్చింది.
వివరాలు
మొత్తం పరిహారం $35.85 మిలియన్
జ్యూరీ నిర్ణయించిన మొత్తంతో పాటు, బోయింగ్ కంపెనీ అదనంగా 3.45 మిలియన్ డాలర్లు గార్గ్ భర్త సౌమ్య భట్టాచార్యకు చెల్లించడానికి అంగీకరించింది. ఇది కోర్టు వెలుపల జరిగిన ఒప్పందం భాగమని సమాచారం. దీంతో బోయింగ్ నుంచి కుటుంబానికి అందబోయే మొత్తం పరిహారం $35.85 మిలియన్గా నిలిచింది. ఇందులో $28 మిలియన్ జ్యూరీ తీర్పు ప్రకారం, వడ్డీతో కలిపి, మిగిలిన $3.45 మిలియన్ భట్టాచార్యకు చెల్లించబడుతుంది.
వివరాలు
ఆ దుర్ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబసభ్యులకు మా హృదయపూర్వక సానుభూతి: బోయింగ్
జ్యూరీ తీర్పుపై స్పందించిన బోయింగ్ ప్రతినిధి, "ఆ రెండు విమానాల్లో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ మేము లోతుగా చింతిస్తున్నాం" అని తెలిపారు. చాలా మంది కుటుంబాలతో బోయింగ్ ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికీ, వారు కోర్టు ద్వారా పరిహారం కోసం ప్రయత్నించడాన్ని గౌరవిస్తున్నామని కూడా చెప్పారు. కుటుంబ న్యాయవాదులు షానిన్ స్పెక్టర్ మరియు ఎలిజబెత్ క్రాఫర్డ్ మాట్లాడుతూ, "ఈ తీర్పు బోయింగ్ చేసిన తప్పుదారితనానికి ప్రజా బాధ్యతను నిర్ధారిస్తుంది" అన్నారు.
వివరాలు
737 MAX విమానాన్ని లోపభూయిష్టంగా డిజైన్ చేసిందని ఆరోపణ
దావాలో బోయింగ్ కంపెనీ 737 MAX మోడల్ విమానాన్ని లోపభూయిష్టంగా రూపొందించిందని, దాని ప్రమాదకర స్వరూపం గురించి ప్రజలకు ముందుగానే హెచ్చరించలేదని ఆరోపించారు. ఈథియోపియా ఎయిర్‌లైన్స్ విమానం ప్రమాదానికి ఐదు నెలల ముందు, ఇండోనేషియాలోని లయన్ ఎయిర్ 610 విమానం కూడా ఇలాంటి కారణంతో.. ఆటోమేటెడ్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ లోపంతో.. సముద్రంలో కూలిపోయింది. స్పెక్టర్ మాట్లాడుతూ, "శిఖా గార్గ్ ఒక ప్రతిభావంతమైన పీహెచ్‌డీ అభ్యర్థి, వివాహం అయిన కొద్ది నెలల్లోనే ఆ దురదృష్టకరమైన విమాన ప్రయాణంలో పాల్గొన్నారు" అన్నారు.
వివరాలు
బోయింగ్ బాధ్యతను ముందే అంగీకరించిందని కోర్టు తెలిపింది
ఈ కేసులో జ్యూరీకి బోయింగ్ బాధ్యతను నిర్ణయించే అవసరం లేకపోయింది, ఎందుకంటే కంపెనీ ఇప్పటికే తన బాధ్యతను అంగీకరించింది. జ్యూరీ పని గార్గ్ కుటుంబానికి కలిగిన ఆదాయ నష్టం, మానసిక వేదనలకు పరిహారం నిర్ణయించడం. స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం, గార్గ్ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమంలో కన్సల్టెంట్‌గా పని చేస్తూ, ఆ ప్రమాద సమయంలో కెన్యాలోని నైరోబీ నగరంలో జరగనున్న పర్యావరణ సమావేశానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
వివరాలు
మరణానికి ముందు ప్రయాణికులు వేదన అనుభవించారా?
ప్రమాదానికి ముందు ప్రయాణికులు వేదన అనుభవించారా లేదా అన్నది.. విచారణలో ప్రధాన అంశం. బోయింగ్ తరఫు న్యాయవాది డాన్ వెబ్, "గార్గ్ కుటుంబానికి న్యాయంగా, తగినంత పరిహారం ఇవ్వాలని" జ్యూరీని కోరారు. బోయింగ్ వాదన ప్రకారం, ప్రయాణికులు ప్రమాదానికి ముందు శారీరక బాధ అనుభవించలేదని చెప్పారు. అయితే, జ్యూరీ తీర్పులో గార్గ్ కుటుంబానికి $10 మిలియన్ "ప్రమాదానికి ముందు ఎదురైన భయం, మానసిక వేదన" పరిహారంగా ఇవ్వాలని పేర్కొంది.