LOADING...
SBI: ఎస్‌బీఐ నుంచి బంపర్ ఆఫర్.. ఎఫ్‌డీ వడ్డీ రేట్లు పెంపు.. పూర్తి వివరాలు ఇవే!
ఎస్‌బీఐ నుంచి బంపర్ ఆఫర్.. ఎఫ్‌డీ వడ్డీ రేట్లు పెంపు.. పూర్తి వివరాలు ఇవే!

SBI: ఎస్‌బీఐ నుంచి బంపర్ ఆఫర్.. ఎఫ్‌డీ వడ్డీ రేట్లు పెంపు.. పూర్తి వివరాలు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 24, 2026
03:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసే వారికి అదిరే శుభవార్తను ఎస్‌బీఐ ప్రకటించింది. చాలా బ్యాంకులు ఎఫ్‌డీ వడ్డీ రేట్లను తగ్గిస్తున్న సమయంలో ఎస్‌బీఐ మాత్రం వడ్డీ రేట్లను పెంచి డిపాజిటర్లకు అదనపు లాభాలను అందిస్తోంది. రూ.3 కోట్లకు పైగా ఉన్న బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచినట్లు వెల్లడించింది. ఈ కొత్త రేట్లు మార్చి 15, 2026 నుంచే అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్ తెలిపింది.

వివరాలు

టెన్యూర్‌ ఆధారంగా కొత్త వడ్డీ రేట్లు

ఎంపిక చేసిన టెన్యూర్ డిపాజిట్లపై జనరల్ కస్టమర్లకు 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ పెంపు జరిగింది. 46 నుంచి 179 రోజుల మధ్య టెన్యూర్ ఉన్న డిపాజిట్లపై వడ్డీ 5.10% నుంచి 5.35%కు పెరిగింది. 180 రోజుల నుంచి ఒక సంవత్సరం లోపు టెన్యూర్‌పై 5.60% నుంచి 5.85%కు పెంచారు. 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపు బల్క్ డిపాజిట్లపై వడ్డీ 6.25% నుంచి 6.50%కు పెరిగింది.

వివరాలు

సీనియర్ సిటిజన్లకు మరింత లాభం

సీనియర్ సిటిజన్లకు సాధారణ కస్టమర్ల కంటే అధిక వడ్డీ రేట్లు అందిస్తున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. 46 నుంచి 179 రోజుల టెన్యూర్‌పై 5.60% నుంచి 5.85%కు పెంపు 180 రోజుల నుంచి ఏడాది లోపు టెన్యూర్‌పై 6.10% నుంచి 6.35%కు పెంపు 1 నుంచి 2 సంవత్సరాల టెన్యూర్‌పై 6.75% నుంచి 7%కు పెంపు ఎవరికీ వర్తిస్తాయి? ఈ సవరించిన వడ్డీ రేట్లు కొత్తగా చేసే డిపాజిట్లకు, అలాగే మెచ్యూరిటీ తర్వాత రిన్యువల్ చేసే డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తాయి. మిగతా షరతులు, నిబంధనల్లో ఎలాంటి మార్పులు లేవని బ్యాంక్ స్పష్టం చేసింది.

Advertisement

వివరాలు

ముఖ్య గమనిక

రూ.3 కోట్లకు పైగా డిపాజిట్ చేసే వారికి ప్రస్తుతం ఈ రేట్లు మంచి అవకాశంగా భావించవచ్చు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఇది లాభదాయకం. అయితే బల్క్ టర్మ్ డిపాజిట్లపై ప్రీమేచ్యూర్ విత్‌డ్రాయల్ చేస్తే 1% పెనాల్టీ వర్తిస్తుంది. అంటే మెచ్యూరిటీకి ముందు డబ్బు తీసుకుంటే వడ్డీపై 1% తగ్గింపు ఉంటుంది.

Advertisement