Post Office Best Scheme: పోస్టాఫీస్ RD స్కీమ్‌తో బంపర్ రిటర్న్స్.. 10 ఏళ్లలో రూ.25 లక్షలు సంపాదించే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
భద్రతతో కూడిన పెట్టుబడులను కోరుకునే వారికి ఇండియా పోస్ట్ అందించే రికరింగ్ డిపాజిట్ (RD) పథకం ఇప్పటికీ అత్యంత విశ్వసనీయమైన సేవింగ్ ఆప్షన్‌గా నిలుస్తోంది. ప్రభుత్వ మద్దతుతో నడిచే ఈ పథకం చిన్న మొత్తాలతో ప్రారంభించి, దీర్ఘకాలంలో పెద్ద నిధిని సృష్టించుకోవాలనుకునే వారికి మంచి అవకాశం కల్పిస్తోంది. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్ రూ.25 లక్షలకు చేరుకునే పెట్టుబడి ప్రణాళిక దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు 10 సంవత్సరాల కాలపరిమితి అత్యధిక లాభాలను ఫోస్టాఫీస్ అందిస్తుంది. ప్రతి నెలా రూ.15,000 చొప్పున 120 నెలలు డిపాజిట్ చేస్తే, మెచ్యూరిటీ సమయానికి సుమారు రూ.25,68,107 లభిస్తుంది. మొత్తం పెట్టుబడి: రూ.18,00,000 వడ్డీ ఆదాయం: రూ.7,68,107
వివరాలు
5 ఏళ్లలో కూడా మంచి రాబడి
త్రైమాసిక కాంపౌండింగ్ విధానం వల్ల ఈ స్థాయి వడ్డీ లభిస్తుంది. పోస్టాఫీస్ RD ప్రారంభ కాలపరిమితి 5 సంవత్సరాలు మాత్రమే ఉన్నప్పటికీ, దాన్ని మరో 5 సంవత్సరాలు పొడిగించడం ద్వారా ఈ ప్రయోజనం పొందవచ్చు. కేవలం 5 సంవత్సరాల పాటు ప్రతి నెల రూ.15,000 చెల్లించినా, మంచి రాబడిని పొందే అవకాశం ఉంది: మొత్తం పెట్టుబడి: రూ.9,00,000 మెచ్యూరిటీ విలువ: సుమారు రూ.10,71,545 వడ్డీ ఆదాయం: రూ.1.7 లక్షలకు పైగా
వివరాలు
ముఖ్య ప్రయోజనాలు
చిన్న మొత్తంతో ప్రారంభం: ఈ పథకంలో నెలకు కేవలం రూ.100తో కూడా ఖాతా ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి లేకపోవడం వల్ల ఆదాయం పెరిగే కొద్దీ పెట్టుబడిని పెంచుకోవచ్చు. లోన్ సౌకర్యం 12 నెలల పాటు క్రమంగా డిపాజిట్ చేసిన తర్వాత ఖాతాలోని మొత్తంలో 50% వరకు రుణం పొందే అవకాశం ఉంది. అడ్వాన్స్ చెల్లింపులు ప్రతి నెల చెల్లింపుల ఇబ్బందిని తగ్గించేందుకు ముందుగానే 5 సంవత్సరాల వరకు ఇన్‌స్టాల్‌మెంట్లు చెల్లించవచ్చు. గ్యారంటీడ్ రిటర్న్స్ మార్కెట్‌పై ఆధారపడని ఈ పథకంలో రాబడులు ముందుగానే నిర్ణయించబడతాయి. దీంతో మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం ఉండదు. పోస్టాఫీస్ RD పథకం క్రమశిక్షణతో కూడిన సేవింగ్స్ అలవాటు పెంపొందించడమే కాకుండా, భవిష్యత్తుకు బలమైన ఆర్థిక భద్రతను అందిస్తుంది.