Page Loader
Byju- CEO resignation: బైజూస్ సీఈవో రాజీనామా...బాధ్యతలు స్వీకరించిన రవీంద్రన్
బైజూస్ సీఈవో రాజీనామా...బాధ్యతలు స్వీకరించిన రవీంద్రన్

Byju- CEO resignation: బైజూస్ సీఈవో రాజీనామా...బాధ్యతలు స్వీకరించిన రవీంద్రన్

వ్రాసిన వారు Stalin
Apr 15, 2024
12:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

బైజూస్ సంస్థ రోజువారీ కార్యకలాపాలను నిర్వహించేందుకు గాను రవీంద్రన్ సీఈఓ బాధ్యతలు చేపట్టారు. బైజూస్ సీఈవో అర్జున్ మోహన్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బైజూస్ యాజమాన్యం మీడియాకు వెల్లడించింది. తమ సంస్థ ముఖ్యంగా మూడు ప్రధాన విషయాలపై దృష్టిపెట్టిందని తెలిపింది. లెర్నింగ్ యాప్, ఆన్ లైన్ తరగతుల నిర్వహణ, ట్యూషన్ సెంటర్లు, పరీక్షల ప్రిపరేషన్ అంశాలపై దృష్టి సారించిందని వివరించింది. సీఈవో బాధ్యతల నుంచి అర్జున్ మోహన్ వైదొలిగిన తర్వాత ఏడు నెలల పాటు జరిగిన సంస్థ కార్యక్రమాలపైనా, వ్యయ నిర్వహణ వంటి అంశాలపై సమీక్ష చేసినట్లు పేర్కొంది.

Byjus-Ravindran

రవీంద్రన్​ సంస్థను వృద్ధిలోకి తెస్తారు...

సంస్థ బాధ్యతలు చేపట్టిన రవీంద్రన్... సంస్థ రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు, సంస్థ పురోభివృద్ధికి ఇతోధికంగా కృషి చేస్తారనే నమ్మకముందని సంస్థ విశ్వాసాన్ని ప్రకటించింది. గత నాలుగేళ్లుగా రవీంద్రన్ బైజూస్ పెట్టుబడులు పెంచడంలోనూ, ప్రపంచవ్యాప్తంగా తన సంస్థను విస్తరించడంపైనా ప్రధానంగా దృష్టి పెట్టారని తెలిపింది.