Byju's: దేశవ్యాప్తంగా ఆఫీసులన్నీ ఖాళీ చేస్తున్న బైజూస్
ఒకప్పుడు దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ కంపెనీల్లో ఉన్న 'బైజూస్' పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఇప్పటికే ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో సంస్థ ఉంది. తాజాగా అద్దె చెల్లించలేక బెంగళూరులోని ప్రధాన కార్యాలయం మినహా కంపెనీ అన్ని కార్యాలయాలను ఖాళీ చేస్తోంది. గత కొన్ని నెలలుగా బైజూస్ తన కార్యాలయాలను ఖాళీ చేయడంలో నిమగ్నమైంది. ఈ క్రమంలో ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయాలని సంస్థ ఆదేశించింది. అయితే ఈ వ్యవహారంపై స్పందించేందకు బైజుస్ నిరాకరించింది. 2022 ప్రారంభంలో ఈ కంపెనీ వాల్యుయేషన్ 22 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉండేది. ఇప్పుడు సుమారు ఒక బిలియన్ డాలర్లకు తగ్గింది.