LOADING...
Canara Bank: ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్.. ఫాస్ట్ అండ్ సేఫ్‌గా డిజిటల్ లావాదేవీలు 
ఫాస్ట్ అండ్ సేఫ్‌గా డిజిటల్ లావాదేవీలు

Canara Bank: ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్.. ఫాస్ట్ అండ్ సేఫ్‌గా డిజిటల్ లావాదేవీలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 24, 2025
12:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏఐ ఆధారిత సౌకర్యాలతో కెనరా బ్యాంక్ కొత్త మొబైల్ యాప్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాలు,పట్టణాల్లో డిజిటల్ లావాదేవీలను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఈ యాప్‌ను రూపొందించారు. గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు ఆపిల్ యాప్ స్టోర్‌లోనూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఇతర యూపీఐ యాప్‌ల ద్వారా సేవలు పొందుతున్న కెనరా బ్యాంక్ ఖాతాదారులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కొత్త యాప్‌కు మారవచ్చు. 'కెనరా ఏఐ 1 పే' పేరుతో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సేవలను బ్యాంక్ ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా ఏ బ్యాంక్ ఖాతానైనా లింక్ చేసుకొని వేగవంతంగా, సురక్షితంగా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు.

వివరాలు 

హోమ్ స్క్రీన్ నుంచే క్యూఆర్ కోడ్ స్కాన్ 

సాధారణ వినియోగదారులతో పాటు వ్యాపారులు, చిన్న షాపులు, స్వయం ఉపాధి పొందే వారు కూడా చెల్లింపులు స్వీకరించేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఫీచర్ల పరంగా చూస్తే, నెలవారీ ఖర్చుల విశ్లేషణ, విభాగాల వారీగా వ్యయ వివరాలు, ఆర్థిక ధోరణులను చూపించే సమాచారం అందిస్తుంది. హోమ్ స్క్రీన్ నుంచే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వెంటనే చెల్లింపులు జరపవచ్చు. చిన్న మొత్తాల లావాదేవీలకు పిన్ నమోదు చేయాల్సిన అవసరం లేకుండా సౌకర్యం కల్పించారు.

వివరాలు 

భద్రతకు ప్రాధాన్యం

బిల్లులు, సబ్‌స్క్రిప్షన్లు, ఈఎంఐలు, ఎస్ఐపీల వంటి చెల్లింపులను ఆటోమేటిక్ విధానంలో నిర్వహించుకునే అవకాశం కూడా ఉంది. భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ బయోమెట్రిక్ లాగిన్, రిజిస్టర్ చేసిన మొబైల్ నుంచే లావాదేవీలు జరిగేలా డివైస్ బైండింగ్ వంటి బహుస్థాయి భద్రతా వ్యవస్థలను అందించారు. అనుమానాస్పద లావాదేవీలు జరిగితే వెంటనే గుర్తించి వినియోగదారులకు హెచ్చరికలు పంపే సౌకర్యం కూడా ఈ యాప్‌లో ఉంది.

Advertisement