LOADING...
FDI: బీమా రంగంలో 100% ఎఫ్‌డీఐకి కేంద్రం అనుమతి
బీమా రంగంలో 100% ఎఫ్‌డీఐకి కేంద్రం అనుమతి

FDI: బీమా రంగంలో 100% ఎఫ్‌డీఐకి కేంద్రం అనుమతి

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 17, 2026
09:34 am

ఈ వార్తాకథనం ఏంటి

బీమా రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) అనుమతి ఇస్తూ కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖకు చెందిన పరిశ్రమలు,అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నిర్ణయం ప్రకారం,బీమా సంస్థల్లో ఆటోమేటిక్ మార్గం ద్వారా పూర్తిస్థాయి ఎఫ్‌డీఐ పెట్టుబడులను అనుమతించనున్నారు. అయితే, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) విషయంలో మాత్రం విదేశీ పెట్టుబడులకు గరిష్టంగా ఇరవై శాతం వరకు మాత్రమే అవకాశం ఉంటుంది.

వివరాలు 

సబ్‌కా బీమా సబ్‌కీ రక్షా బిల్లుకు పార్లమెంటు ఆమోదం

విదేశీ పెట్టుబడులు కలిగిన భారతీయ బీమా కంపెనీలలో పాలనా వ్యవస్థకు సంబంధించిన నిబంధనలను కూడా స్పష్టంచేశారు. ఆ సంస్థల బోర్డు చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవుల్లో కనీసం ఒక్కరైనా భారతదేశంలో నివసించే భారతీయ పౌరుడై ఉండాల్సిందేనని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, బీమా చట్టాల్లో సవరణలకు ఉద్దేశించిన 'సబ్‌కా బీమా సబ్‌కీ రక్షా' బిల్లు-2025కు గత డిసెంబర్ నెలలో పార్లమెంటు ఆమోదం తెలిపింది.

Advertisement