Bill Gates: ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో మార్పులు.. బిల్ గేట్స్ దూరం
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్' నుంచి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తప్పుకున్నారు. లైంగిక వేధింపుల కేసుల్లో దోషిగా నిలిచిన జెఫ్రీ ఎప్స్టీన్‌తో గేట్స్‌కు ఉన్న సంబంధాలు, తాజాగా వెలుగులోకి వచ్చిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఆయన పేరు ప్రస్తావనకు రావడం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాన్ని పునఃసమీక్షించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. "బాధితులకు అండగా నిలవడం మా ప్రాధాన్యత" అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Details
వక్తల జాబితా నుంచి పేరు తొలగింపు
సోమవారం వరకు సదస్సు ప్రధాన వక్తల జాబితాలో ఉన్న బిల్ గేట్స్ పేరు, మంగళవారం ఉదయానికి తొలగించారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో గేట్స్ భేటీ అయ్యారు. అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకుని ఏఐ సదస్సులో పాల్గొనాల్సి ఉండగా, ఎప్‌స్టీన్ ఫైల్స్ వివాదం కారణంగా ఆయన పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నాయి.
Details
సదస్సు కొనసాగింపు
బిల్ గేట్స్ దూరమైనప్పటికీ, సదస్సు నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతోంది. సుందర్ పిచాయ్, సామ్ ఆల్ట్‌మాన్ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. భారత్‌ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్రపై ఈ సదస్సులో విస్తృత చర్చలు జరుగుతున్నాయి.