LOADING...
Cheque Bounce Rules: చెక్ బౌన్స్ అయితే ఏం జరుగుతుంది? చట్టం ఏం చెబుతోంది?
చెక్ బౌన్స్ అయితే ఏం జరుగుతుంది? చట్టం ఏం చెబుతోంది?

Cheque Bounce Rules: చెక్ బౌన్స్ అయితే ఏం జరుగుతుంది? చట్టం ఏం చెబుతోంది?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2026
05:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల కాలం నడుస్తోంది.స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ఇంట్లో నుంచే డబ్బు పంపడం,స్వీకరించడం,బిల్లులు చెల్లించడం వంటి అనేక పనులు సులభంగా పూర్తవుతున్నాయి. ఒకప్పుడు నగదు డిపాజిట్ చేయాలన్నా,డ్రా చేయాలన్నా బ్యాంకుల వద్ద గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు యూపీఐ,నెట్ బ్యాంకింగ్ వంటి సదుపాయాలతో కేవలం కొన్ని సెకన్లలోనే లావాదేవీలు పూర్తి చేసుకోవచ్చు. అయితే డిజిటల్ చెల్లింపులు విస్తృతంగా పెరిగినా,పెద్ద మొత్తాల లావాదేవీలు లేదా వ్యాపార అవసరాల కోసం ఇప్పటికీ చాలామంది చెక్కులను ఉపయోగిస్తున్నారు. అయితే చెక్కు రాసేటప్పుడు చిన్న పొరపాటు చేసినా అది బౌన్స్ అయ్యే ప్రమాదం ఉంది.

వివరాలు 

చెక్ బౌన్స్ అయితే జైలుశిక్ష పడుతుందా?

చెక్ బౌన్స్ అయితే కేవలం బ్యాంక్ లావాదేవీ విఫలం కావడమే కాదు.. చట్టపరమైన సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. చెక్ బౌన్స్ కేసుల గురించి తరచూ వార్తల్లో చూస్తూనే ఉంటాం. బ్యాంక్ ఖాతాలో తగినంత నగదు లేకపోవడం లేదా ఇతర కారణాలతో చెక్కు తిరస్కరణకు గురైతే, కొన్ని పరిస్థితుల్లో చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 1881 నాటి నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 138 ప్రకారం, చెక్ బౌన్స్ అయిన సందర్భంలో చెక్కు జారీ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయవచ్చు. కోర్టు విచారణ అనంతరం నేరం రుజువైతే గరిష్టంగా రెండేళ్ల వరకు జైలుశిక్ష లేదా చెక్కు మొత్తానికి రెండింతల వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.

వివరాలు 

చెక్ బౌన్స్ అయితే జైలుశిక్ష పడుతుందా?

అయితే చెక్ బౌన్స్ అయిన వెంటనే జైలుకు పంపరు.ముందుగా చెక్కు తీసుకున్న వ్యక్తి చట్టపరమైన నోటీసు పంపుతారు. ఆ నోటీసు అందిన తర్వాత 15రోజుల లోపు బకాయి మొత్తాన్ని చెల్లించే అవకాశం ఉంటుంది. ఆ గడువులో చెల్లింపు జరగకపోతే కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేయవచ్చు.అనంతరం కోర్టు విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకుంటుంది. తరచూ చెక్కులు బౌన్స్ చేసే వారిపై కోర్టులు కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఇక చెక్ బౌన్స్ అయినప్పుడు బ్యాంకులు కూడా ఛార్జీలు విధిస్తాయి.బ్యాంకు నిబంధనలను బట్టి చెక్కు జారీ చేసిన వ్యక్తి, కొన్నిసార్లు చెక్కు సమర్పించిన వ్యక్తి ఖాతాల నుంచి రూ.150 నుంచి రూ.750 వరకు రుసుము వసూలు చేసే అవకాశం ఉంటుంది.

Advertisement

వివరాలు 

చెక్ బౌన్స్ కావడానికి ప్రధాన కారణాలు

దీంతో చెక్ బౌన్స్ ఆర్థికంగానే కాకుండా చట్టపరంగానూ ఇబ్బందులను కలిగించవచ్చు. చెక్కు జారీ చేసిన ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోవడం. చెక్కుపై ఉన్న సంతకం బ్యాంకు రికార్డులతో సరిపోలకపోవడం. చెక్కులో తేదీ లేదా ఇతర వివరాల్లో పొరపాట్లు ఉండటం. చెక్ బౌన్స్ కాకుండా ఉండాలంటే.. చెక్కు జారీ చేసే ముందు ఖాతాలో సరిపడా నగదు ఉందో లేదో నిర్ధారించుకోవాలి. సంతకం బ్యాంకు రికార్డుల్లో ఉన్న విధంగానే ఉండేలా చూసుకోవాలి. తేదీ, మొత్తం, లబ్ధిదారుడి పేరు వంటి వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలి. చెక్కుపై రాతలు, కొట్టివేతలు లేకుండా జాగ్రత్త పడాలి. చెక్కు జారీ చేసే సమయంలో కాస్త అప్రమత్తంగా ఉంటే అనవసరమైన జరిమానాలు, కోర్టు కేసులు, చట్టపరమైన చిక్కులను సులభంగా నివారించవచ్చు.

Advertisement