
RBI new rules from Oct 4: ఇక చెక్కు క్లియరెన్స్ గంటల్లోనే… శుభవార్త చెప్పిన ఆర్బీఐ!
ఈ వార్తాకథనం ఏంటి
రాబోయే అక్టోబర్ 4 నుంచి చెక్కుల క్లియరెన్స్ ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నట్లు భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ప్రకటించింది. ప్రస్తుతం రెండు పని రోజుల వరకు పడుతున్న సెటిల్‌మెంట్ సమయాన్ని కొన్ని గంటలకు తగ్గించనుంది. కొత్త విధానం ఎలా పనిచేస్తుంది? ఇప్పటివరకు బ్యాచ్ ప్రాసెసింగ్ పద్ధతిలో నడుస్తున్న Cheque Truncation System (CTS) ఇకపై 'కాంటిన్యూయస్ క్లియరింగ్ & సెటిల్‌మెంట్ ఆన్ రియలైజేషన్' మోడల్‌కు మారనుంది. ఈ మార్పు రెండు దశల్లో అమలు కానుంది. మొదటి దశ అక్టోబర్ 4 నుంచి, రెండవ దశ జనవరి 3 నుంచి ప్రారంభం అవుతుంది.
Details
ఉదయం వచ్చిన చెక్కులను మధ్యాహ్నం లోపు నిర్ధారించాలి
కొత్త వ్యవస్థలో బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చెక్కులను స్కాన్ చేసి క్లియరింగ్ హౌస్‌కి నిరంతరంగా పంపిస్తాయి. క్లియరింగ్ హౌస్ వెంటనే ఆ చెక్కుల ఇమేజ్‌లను చెల్లించాల్సిన బ్యాంక్ (డ్రాయీ బ్యాంక్)కు పంపుతుంది. మొదటి దశలో డ్రాయీ బ్యాంక్‌లు సాయంత్రం 7 గంటలలోపు చెక్కును ఆమోదించాలా లేదా తిరస్కరించాలా అనే నిర్ధారణ ఇవ్వాలి. ఆ సమయానికి సమాధానం రాకపోతే, ఆ చెక్కు ఆటోమేటిక్‌గా ఆమోదించబడినట్లు పరిగణిస్తారు. రెండవ దశలో ఈ నిర్ధారణ సమయాన్ని 3 గంటలకు కుదిస్తారు. ఉదాహరణకు ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య వచ్చిన చెక్కులు మధ్యాహ్నం 2 గంటలలోపు నిర్ధారించాలి.
Details
ఆర్బీఐ ఉద్దేశ్యం ఇదే
ప్రతి గంటకోసారి సెటిల్‌మెంట్ జరుగుతుంది. సెటిల్‌మెంట్ పూర్తయ్యాక, ప్రెజెంటింగ్ బ్యాంక్ ఒక గంటలోపు కస్టమర్ ఖాతాలో నిధులు జమ చేయాలి. ఇది సాధారణ చెక్సుతో పాటే అమలవుతుంది. చెక్కుల లావాదేవీలలో సామర్థ్యాన్ని పెంచడం, ఆలస్యాలను తగ్గించడం, కస్టమర్లకు మెరుగైన అనుభవం అందించడం లక్ష్యమని ఆర్ బి ఐ వెల్లడించింది. ఈ మార్పుకు అవసరమైన సన్నాహాలు చేసుకోవాలని, కస్టమర్లకు కొత్త టైమ్‌లైన్ వివరాలు తెలియజేయాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. అదనంగా విదేశీ కరెన్సీ రూపాయి నిల్వలను ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు అనుమతించినట్లు ఆర్బీఐ తెలిపింది. దీని వల్ల ఆర్థిక మార్కెట్లలో లిక్విడిటీ పెరిగే అవకాశం ఉంది.