China's economy: చైనా ఆర్థిక వ్యవస్థకు ఊపిరి.. తొలి త్రైమాసికంలో 5% వృద్ధి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా చైనా ఆర్థిక వ్యవస్థ బలంగా ముందుకు సాగుతోంది. 2026 తొలి త్రైమాసికంలో చైనా ఆర్థిక వృద్ధి 5 శాతానికి చేరుకుని అంచనాలను మించి నిలిచింది. జనవరి నుంచి మార్చి వరకు ఈ వృద్ధి నమోదైనట్లు చైనా గణాంకాల విభాగం వెల్లడించింది. నిపుణులు అంచనా వేసిన 4.8 శాతం కంటే ఇది ఎక్కువ కావడం విశేషం. అయితే రియల్ ఎస్టేట్ సంక్షోభం, దేశీయ వినియోగం మందగమనం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
వివరాలు
2026కి చైనా వృద్ధి అంచనా 4.4 శాతం
ఇదే సమయంలో మార్చిలో రిటైల్ సేల్స్ కేవలం 1.7 శాతం మాత్రమే పెరిగి, అంచనాలను అందుకోలేకపోయాయి. మరోవైపు పరిశ్రమల ఉత్పత్తి 5.7 శాతం పెరిగి అంచనాలను మించింది కానీ గత నెలలతో పోలిస్తే కొంత తగ్గింది. ఇక అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి వద్ద రవాణా అంతరాయం ఏర్పడి ప్రపంచ ఇంధన ధరలు పెరుగుతున్నాయి. అయినప్పటికీ చైనా విభిన్న ఇంధన వనరులు తక్షణ ప్రభావాన్ని తగ్గించగలవని నిపుణులు చెబుతున్నారు. కానీ గ్లోబల్ డిమాండ్ పడిపోతే ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే 2026కి చైనా వృద్ధి అంచనాను 4.4 శాతానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి తగ్గించింది.