NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / China Economy: వడ్డీ రేట్ల తగ్గింపు.. స్థిరాస్తి సంక్షోభాన్ని నివారించేందుకు చైనా కీలక చర్యలు 
    తదుపరి వార్తా కథనం
    China Economy: వడ్డీ రేట్ల తగ్గింపు.. స్థిరాస్తి సంక్షోభాన్ని నివారించేందుకు చైనా కీలక చర్యలు 
    వడ్డీ రేట్ల తగ్గింపు.. స్థిరాస్తి సంక్షోభాన్ని నివారించేందుకు చైనా కీలక చర్యలు

    China Economy: వడ్డీ రేట్ల తగ్గింపు.. స్థిరాస్తి సంక్షోభాన్ని నివారించేందుకు చైనా కీలక చర్యలు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 24, 2024
    03:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్థిక వ్యవస్థను తిరిగి పటిష్టం చేసేందుకు చైనా పలు కీలక చర్యలు చేపట్టింది.

    ఈ సెంట్రల్ బ్యాంక్, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా, స్థిరాస్తి రంగానికి బూస్ట్ ఇచ్చేందుకు కీలక నిర్ణయాలను ప్రకటించింది.

    క్యాష్ రిజర్వ్ రేషియో, కమర్షియల్ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వడ్డీ, ప్రాపర్టీ కొనుగోలుపై డౌన్ పేమెంట్ శాతం వంటి అంశాలను తగ్గించినట్లు తెలుస్తోంది.

    కొవిడ్-19 సమయంలో చైనా ఆర్థిక వ్యవస్థ మందగించిన విషయం తెలిసిందే. నిరుద్యోగిత పెరగడం, ఇళ్ల ధరలు గణనీయంగా తగ్గాయి. చైనీయుల కొనుగోలు శక్తి కూడా తగ్గుముఖం పట్టింది.

    Details

    మార్ట్ గేజ్ రుణాలపై వడ్డీ 0.5శాతం తగ్గింపు

    ఇల్లు, విద్యుత్ వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలితం ఇవ్వలేదు. ఈ పరిస్థితుల వల్ల చైనా వృద్ధి నెమ్మదిస్తోంది.

    చైనా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ పాన్ గాంగ్షెంగ్ మాట్లాడుతూ, బ్యాంకులు కనీసం కలిగి ఉండాల్సిన నగదు నిల్వల నిష్పత్తిని 0.5 శాతం తగ్గించాలని నిర్ణయించారు.

    ఈ చర్యలతో బ్యాంకులు పౌరులకు ఎక్కువ రుణాలు ఇచ్చేందుకు అవకాశముంది.

    మార్ట్‌గేజ్ రుణాలపై వడ్డీ 0.5 శాతం తగ్గించాలని కమర్షియల్ బ్యాంకులకు సూచించారు.

    రెండో ఇంటిని కొనుగోలు చేస్తున్న వారి డౌన్ పేమెంట్‌ను 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించడం విశేషం.

    Details

    15 కోట్ల మందికి ప్రయోజనం

    ఈ నిర్ణయాలతో 5 కోట్ల కుటుంబాలకు, 15 కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుందని గవర్నర్ పేర్కొన్నారు.

    ఈ చర్య వల్ల సుమారు 150 బిలియన్ యువాన్లు (21 బిలియన్ డాలర్లు) వడ్డీ భారం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

    చైనా రియల్ ఎస్టేట్ ప్రధాన మార్కెట్‌గా ఉంది, దీనిపై నిర్మాణ రంగం, హోమ్ డెకరేషన్, గృహోపకరణాల వంటి పరిశ్రమలు ఆధారపడి ఉన్నాయి.

    అయితే అధిక రుణాలు, గృహ విక్రయాలు తగ్గడం వల్ల స్థిరాస్తి మార్కెట్ సంక్షోభానికి గురైంది.

    ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైనా
    వ్యాపారం

    తాజా

    Tesla: టెస్లా కేవలం షోరూమ్‌ల స్థాపనపై మాత్రమే దృష్టి: కేంద్ర మంత్రి టెస్లా
    AI in 2030: ఏఐ రాక‌తో 2030 నాటికి కొలువులు క‌నుమ‌రుగు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    stock market: స్వల్పనష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు  స్టాక్ మార్కెట్
    Kamal Haasan: 'థగ్ లైఫ్‌' విడుదల కోసం హైకోర్టును ఆశ్రయించిన కమల్‌ హాసన్‌! కమల్ హాసన్

    చైనా

    America Vs China : డ్రాగన్ వెన్ను విరిచిన అమెరికా.. చైనా వస్తువుల దిగుమతిపై 100 శాతం వరకు పన్ను  జో బైడెన్
    China: చైనాలో దారుణం.. కత్తితో దాడి చేసి 8 మందిని చంపిన వ్యక్తి  అంతర్జాతీయం
    Time Out: టైమ్ అవుట్ ఆహార ప్రియుల కోసం ఉత్తమ నగరాల జాబితాలో అగ్రస్థానంలో నేపుల్స్  లైఫ్-స్టైల్
    China: చంద్రునిపై నమూనాల సేకరణ.. చైనా లూనార్ ప్రోబ్ సక్సెస్ అంతర్జాతీయం

    వ్యాపారం

    Mother Diary : FY25లో 17000 కోట్ల రూపాయల టర్నోవర్‌ని లక్ష్యంగా పెట్టుకున్న మదర్ డెయిరీ బిజినెస్
    Salesforce: వారానికి 4 నుండి 5 రోజులు ఆఫీసుకు రావాల్సిందే.. ఉద్యోగులకు సేల్స్ ఫోర్స్ సమాచారం సాఫ్ట్ వేర్
    Google :రికార్డు సృష్టించిన గూగుల్ క్లౌడ్.. మొదటిసారి $10B ఆదాయం గూగుల్
    Crowdstrike: క్రౌడ్ స్ట్రైక్ వినియోగదారులకు ప్రభుత్వం హెచ్చరికలు టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025