CNG prices hike: సీఎన్‌జీ ధర మరోసారి పెంపు.. వినియోగదారులకు షాక్
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 17, 2026
09:17 am
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం మరోసారి సీఎన్జీ ధరలను పెంచింది. ప్రస్తుతం కిలో సీఎన్‌జీపై రూ.1 పెంపు చేసినట్లు ప్రకటించింది. రెండు రోజుల క్రితమే కిలోకు రూ.2 పెంపు చేసిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం రెండు రోజుల్లోనే కిలో సీఎన్‌జీ ధర రూ.3 వరకు పెరిగినట్లైంది. ఈ వరుస ధరల పెంపుతో ఆటో, క్యాబ్ వాహనదారులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయని, దాని ప్రభావం సరుకుల ధరలపై పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం సమీక్షించాలని ప్రజలు కోరుతున్నారు.