ట్రావెల్: ఫ్రాన్స్ వెళ్తున్నారా? అక్కడ చేయకూడని కొన్ని పనులు తెలుసుకోండి
ప్రతీ దేశంలో బ్రతకడానికి కొన్ని నియమాలు, కట్టుబాట్లు ఉంటాయి. ఆ దేశంలో ఉన్నప్పుడు అక్కడి నియమాలను, కట్టుబాట్లను, వ్యవహారాలను ఖచ్చితంగా పాటించాలి. పర్యాటకానికి వెళ్ళినా కూడా ఆయా దేశాల పద్దతులను ఫాలో కావాల్సి ఉంటుంది. లేదంటే అక్కడి స్థానికుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఎలా ఉండకూడదో, ఎలా ఉంటే అక్కడి స్థానికులు ఇబ్బంది పడతారో ఇక్కడ చూద్దాం. ఫ్రెంఛ్ మాట్లాడకపోతే: ఫ్రాన్స్ ప్రజలు తమ భాషను అమితంగా గౌరవిస్తారు. వాళ్ళకు ఇంగ్లీష్ తెలిసినా కూడా సాధారణంగా ఫ్రెంచ్ లోనే మాట్లాడుకుంటారు. అవతలి వాళ్ళు కూడా ఫ్రెంచ్ లో మాట్లాడితే బాగుంటుందని అనుకుంటారు. కనీసం బోంజూర్(హలో), మెర్సీ(థ్యాంక్యూ), లాంటి ఫ్రెంఛ్ పదాలైన తెలియాలని గుర్తుంచుకోండి.
ఫ్రాన్స్ వెళ్ళినపుడు ఎలాంటి పనులు చేయకూడదంటే
వెయిటర్ల మీద అరవకూడదు: ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళినపుడు, వెయిటర్ వెయిటర్ అని గట్టిగా పిలుస్తూ అరవకూడదు. వెయిటర్లని పిలవాలంటే కేవలం కళ్ళతో సైగ చేయాలి, లేదా తలను ఆడిస్తూ కమ్యూనికేట్ చేయాలి. అంతేగానీ ఇష్టం వచ్చిన అరవకూడదు. పార్టీకి పిలిస్తే గిఫ్ట్ తప్పనిసరి: మిమ్మల్ని ఎవరైనా పార్టికి పిలిచారనుకోండి. అవతలి వాళ్ళు పార్టీ ఇస్తున్నారు కదా అని ఉత్త చేతులతో వెళ్ళకూడదు. గిఫ్ట్ తీసుకెళ్ళడం వల్ల ఆ పార్టీ ఇస్తుండడానికి మీరు గుర్తించినట్లుగా వాళ్ళు ఫీలవుతారు. రోడ్ల మీద తాగడం, తినడం బంద్: బస్సుల్లో, మెట్రో స్టేషన్లలో తినాలని చూస్తే వాళ్లు ఊరుకోరు. ప్రయాణాల్లో తినడం వారికి అస్సలు నచ్చదు. అలా తినేవాళ్ళకు పరిణతి లేనట్లుగా ఫ్రాన్స్ దేశాస్తులు అనుకుంటారు.