NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ట్రావెల్: జపాన్ లో చాప్ స్టిక్స్ వాడేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
    తదుపరి వార్తా కథనం
    ట్రావెల్: జపాన్ లో చాప్ స్టిక్స్ వాడేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
    జపాన్ లో చాప్ స్టిక్స్ ఎలా ఉపయోగించకూడదో తెలుసుకోండి

    ట్రావెల్: జపాన్ లో చాప్ స్టిక్స్ వాడేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 08, 2023
    03:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జపాన్ దేశస్తులకు క్రమశిక్షణ చాలా ఎక్కువ. అందుకే వారి జీవితకాలం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ క్రమశిక్షణ వారి తినే విధానాల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. జపాన్ లో చాప్ స్టిక్స్ తో భోజనం తినేటపుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

    చాప్ స్టిక్స్ తో కొన్ని పనులు చేయకూడదు. వాటిని జపాన్ లో ఏమంటారో ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకుందాం.

    సుకితాతేబషి (భోజనపళ్ళెంలో చాప్ స్టిక్స్ ని నిలువుగా ఉంచరాదు)

    భోజనం చేస్తున్నప్పుడు పళ్ళెంలో చాప్ స్టిక్స్ ని నిలువుగా ఉంచితే వాళ్ళు సహించలేరు. ఎవరైనా చనిపోతే అంత్యక్రియల దగ్గర శవం మీద కట్టెలను పేర్చినట్టుగా మీ చర్యను వాళ్ళు ఫీలవుతారు. అందుకే భోజనపళ్ళెం పక్కన చాప్ స్టిక్స్ పెట్టాలి.

    ట్రావెల్

    చాప్ స్టిక్స్ ఉపయోగించే ముందు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు

    తతకిబషి(చాప్ స్టిక్స్ ని డ్రమ్స్ లా ఉపయోగించడం):

    భోజన పళ్లెం మీద చాప్ స్టిక్స్ తో కొడుతూ ఉంటే వాళ్ళు మిమ్మల్ని అసహ్యంగా చూస్తారు. దుష్టశక్తులను, నెగెటివ్ ఎనర్జీని మీరు ఆహ్వానిస్తున్నట్టుగా వాళ్ళు అనుకుంటారు.

    నేబురిబషి(చాప్ స్టిక్స్ ని నాలుకతో తాకడం)

    ఒకవేళ మీరిలా చేస్తే జపాన్ వాళ్ళు మిమ్మల్ని అసహ్యించుకుంటారు. చాప్ స్టిక్స్ ని కేవలం ఆహారం తినడానికి మాత్రమే వాడాలి. అందుకే సూప్ వంటి వాటిని చాప్ స్టిక్స్ తో తినే ప్రయత్నం చేయవద్దు.

    శశిబషి(చాప్ స్టిక్స్ తో అవతలివారిని చూపించడం)

    దీన్ని వాళ్ళు నేరంగా పరిగణిస్తారు. అస్సలు ఒప్పుకోరు. మనదగ్గర వేలు చూపించి మాట్లాడితే ఎలా కోప్పడతామో అక్కడ వాళ్ళు చాప్ స్టిక్స్ తో చూపిస్తే అలా కోప్పడతారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పర్యాటకం

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    పర్యాటకం

    ట్రావెల్: ఆనాటి రాచరికానికి గుర్తుగా నిలిచిన కోల్ కతా లోని రాజభవనాలు లైఫ్-స్టైల్
    ఫారెన్ ట్రిప్ అనుభూతిని ఇండియాలో ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ప్రదేశాలు వెళ్ళాల్సిందే లైఫ్-స్టైల్
    వాలెంటైన్స్ డే: మీకు ట్రావెలింగ్ ఇష్టమైతే ఈ రోడ్ ట్రిప్స్ వెళ్ళండి ప్రేమికుల రోజు
    ట్రావెల్: జపాన్ వెళ్తున్నారా? అక్కడ చేయకూడని పనులు తెలుసుకోండి లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025