LOADING...
Gold Rate: ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు బంగారం లభించే దేశం ఇదే..
ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు బంగారం లభించే దేశం ఇదే..

Gold Rate: ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు బంగారం లభించే దేశం ఇదే..

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 10, 2026
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధర దాదాపు ఒకే రకంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ, ప్రతి దేశంలోని మార్కెట్ పరిస్థితులు, స్థానిక పన్నులు, ప్రభుత్వ విధానాల ప్రభావంతో ధరల్లో మార్పులు కనిపిస్తుంటాయి. ఇటీవలి కాలంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరిన నేపథ్యంలో, కొనుగోలు చేయాలనుకునే వారు ఏ దేశాల్లో తక్కువ ధరకే లభిస్తుందో తెలుసుకోవడం అవసరం.

వివరాలు 

అమెరికా 

అమెరికాలో బంగారం ధరలు ఇతర దేశాలతో పోలిస్తే తక్కువగా ఉంటాయి. అక్కడి కరెన్సీ బలం, పెద్ద మార్కెట్ స్థాయి, వ్యాపార పోటీ ఎక్కువగా ఉండటం వంటి కారణాలు ధరలు తగ్గేందుకు దోహదపడుతున్నాయి. ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో బంగారం తక్కువ ధరకు లభించడానికి ప్రధాన కారణం విస్తృతంగా జరుగుతున్న గనుల తవ్వకాలు. సరఫరా ఎక్కువగా ఉండటం, ప్రభుత్వ అనుకూల విధానాలు అమల్లో ఉండటం వల్ల ధరలు తక్కువగా ఉంటాయి.

వివరాలు 

సింగపూర్

సింగపూర్‌లో బంగారం కొనుగోలు చేయడం చౌకగా ఉంటుంది. అక్కడ బంగారం పై వస్తు సేవల పన్ను లేకపోవడం, ఇతర పన్నులు కూడా తక్కువగా ఉండటం వల్ల ధరలు తగ్గి వినియోగదారులకు అనుకూలంగా మారుతున్నాయి. ఇండోనేషియా ఇండోనేషియాలో కూడా బంగారం గనుల తవ్వకాలు విస్తృతంగా జరుగుతాయి. సరఫరా అధికంగా ఉండటంతో పాటు, మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ధరలను నియంత్రించడం వల్ల తక్కువ ధరలకు లభిస్తోంది.

Advertisement

వివరాలు 

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయి నగరం బంగారం చౌకగా దొరికే ప్రధాన కేంద్రంగా పేరుపొందింది. తక్కువ పన్నులు, అధిక వాణిజ్య చురుకుదనం కారణంగా ఇక్కడ ధరలు వినియోగదారులకు అనుకూలంగా ఉంటాయి. కొలంబియా కొలంబియాలో కూడా భారీ స్థాయిలో గనుల తవ్వకాలు జరుగుతాయి. అందువల్ల అక్కడ బంగారం తక్కువ ధరకే లభిస్తుంది. అయితే శుద్ధి చేసిన బంగారం కొంత ఎక్కువ ధరకు ఉండగా, శుద్ధి చేయని బంగారం చాలా తక్కువ ధరకు దొరుకుతుందని రంగ నిపుణులు చెబుతున్నారు.

Advertisement