Deepinder Goyal: రూ.85 వేల టెంపుల్ గ్యాడ్జెట్‌పై వివాదం.. స్పందించిన దీపిందర్ గోయల్
ఈ వార్తాకథనం ఏంటి
మెదడులో రక్తప్రసరణను పర్యవేక్షిస్తుందంటూ మార్కెట్లోకి తీసుకొస్తున్న రూ.85 వేల విలువైన 'టెంపుల్' గ్యాడ్జెట్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ పరికరం ఆరోగ్య రంగంలో మోసపూరిత ఉత్పత్తి అంటూ పలువురు వైద్యులు విమర్శిస్తున్నారు. అయితే జొమాటో మాతృసంస్థ ఎటర్నల్ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తమ ఉత్పత్తి వెనుక శాస్త్రీయ పరిశోధనలు ఉన్నాయని, ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. తమ పరిశోధనలకు అవకాశం ఇవ్వాలని వైద్య నిపుణులను కోరారు.
వివరాలు
'టెంపుల్' పరికరం అభివృద్ధి కోసం రూ.250 కోట్లకు పైగా ఖర్చు
ఈ వివాదంపై గోయల్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందించారు.
'టెంపుల్' పరికరం అభివృద్ధి కోసం ఇప్పటివరకు రూ.250 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
ఇందులో రూ.165 కోట్లకు పైగా తన వ్యక్తిగత నిధుల నుంచే పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు.
పరికరం కొనుగోలు చేసిన వినియోగదారులకు 14 రోజుల పాటు ఎలాంటి కారణం చెప్పకుండానే తిరిగి ఇచ్చే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు.
తక్షణ లాభాల కోసం రెండు దశాబ్దాలకు పైగా కష్టపడి సంపాదించుకున్న వృత్తిపరమైన ప్రతిష్ఠను పణంగా పెట్టబోనని పేర్కొన్నారు.
'టెంపుల్' అభివృద్ధి, పరిశోధనలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేందుకే ఎటర్నల్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దీపిందర్ గోయల్ చేసిన ట్వీట్
A lot of you have pinged me to ask - why are you doing Temple? Why did you leave a ~$35b company you founded 18 years ago to chase a niche health wearable? This doesn’t sound rational.
— Deepinder Goyal (@deepigoyal) November 6, 2026
Why did I leave Eternal? What are we building at Temple? What’s our vision statement? What do…
వివరాలు
శాస్త్రీయ ఆధారాలు ఎక్కడ?
'టెంపుల్' పరికరం పనితీరుపై పూర్తి స్థాయి శాస్త్రీయ నిర్ధారణ జరగడానికి మరికొంత సమయం పడుతుందని గోయల్ అంగీకరించారు.
అయితే పరిశోధనలు కొనసాగుతున్నప్పటికీ ఉత్పత్తిని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాల్సిన దశకు చేరుకున్నామని చెప్పారు.
తమ పరిశోధనలకు సంబంధించిన ప్రీప్రింట్ పత్రాలను త్వరలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
సాధారణంగా పరిశోధన పత్రాలు అధికారిక పీర్ రివ్యూ ప్రక్రియ పూర్తికాకముందే వాటి ప్రాథమిక ఫలితాలను ప్రజలకు అందుబాటులో ఉంచడాన్ని ప్రీప్రింట్ అంటారు.
ఈ పత్రాల ద్వారా బయటి పరిశోధకులు, వైద్య సంస్థలు తమ పరిశోధన వివరాలను, పరీక్షా విధానాలను స్వతంత్రంగా పరిశీలించే అవకాశం ఉంటుందని గోయల్ తెలిపారు.
వివరాలు
రూ.85 వేల ధరకు ప్రీ-ఆర్డర్లు
అయితే ప్రముఖ హెపటాలజిస్ట్ డాక్టర్ సైరియాక్ అబ్బీ ఫిలిప్స్ (ది లివర్ డాక్) ఈ పరికరం పనితీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
మెదడులో రక్తప్రసరణను కొలుస్తున్నట్లు సంస్థ చెబుతున్నప్పటికీ.. వాస్తవానికి ముఖంపై చర్మం, రక్తప్రసరణలో చోటుచేసుకునే మార్పులను మాత్రమే ఈ పరికరం గుర్తిస్తోందని ఆరోపించారు.
దీనికి మెదడు పనితీరుతో సంబంధం ఉందని నిరూపించే పీర్ రివ్యూ పరిశోధనలు, వైద్యపరమైన ఫలితాలు అందుబాటులో లేవని విమర్శించారు.
ఇలాంటి ఆధారాలు లేకుండానే రూ.85 వేల ధరకు ప్రీ-ఆర్డర్లు తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు.
వివరాలు
టెంపుల్ పరికరం ఏం చేస్తుంది?
తల పక్కభాగంలో కణత వద్ద ధరించేలా 'టెంపుల్' పరికరాన్ని రూపొందించారు.
మెదడులో రక్తప్రసరణలో వచ్చే మార్పులను ఇది పర్యవేక్షిస్తుందని సంస్థ చెబుతోంది.
అంతేకాకుండా శరీరం తన అంతర్గత ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు ఎంత శ్రమిస్తోందో తెలియజేసే బయోలాజికల్ ఎంట్రోపీని కూడా కొలుస్తుందని వివరిస్తోంది.
అయితే ఈ పరికరం అందించే కొలతలు ఎంతవరకు కచ్చితమైనవి? వాటి ఆధారంగా ఒక వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు? అనే అంశాలపై వైద్య నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
టెంపుల్ పరికరం ఏం చేస్తుంది?
మరోవైపు, 'టెంపుల్' పరికరంలో ఇంకా వెల్లడించని కొన్ని కీలక ఫీచర్లు ఉన్నాయని గోయల్ తెలిపారు.
వాటిలో కొన్ని వైద్య రంగానికి సంబంధం లేనివి కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
అయితే ప్రస్తుతం నెలకొన్న వివాదానికి తెరపడాలంటే సంస్థ చేస్తున్న శాస్త్రీయ వాదనలకు స్వతంత్ర పరిశోధనలు, పీర్ రివ్యూ అధ్యయనాలు, వైద్యపరమైన ఆధారాలు మద్దతుగా నిలవాల్సి ఉంది.