Deepinder Goyal: దీపిందర్ గోయల్ పిలుపుకు ఊహించని స్పందన: ఎటర్నల్‌కు 8 వేల మెయిల్స్
ఈ వార్తాకథనం ఏంటి
జొమాటో మాతృ సంస్థ Eternal Ltd (ఎటర్నల్ లిమిటెడ్)కు చెందిన మాజీ ఉద్యోగుల నుంచి వచ్చిన స్పందన తనను భావోద్వేగానికి గురి చేసిందని సంస్థ వ్యవస్థాపకుడు Deepinder Goyal వెల్లడించారు. back@eternal.com కార్యక్రమం ద్వారా మాజీ సిబ్బందిని మళ్లీ సంస్థలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన కొన్ని రోజుల్లోనే సంస్థకు ఏకంగా 8,000 ఈమెయిల్స్ వచ్చాయని తెలిపారు. ఈ విషయంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
వివరాలు
వారం రోజుల్లో 8,000 మెయిల్స్
''గత వారం రోజుల్లో మాకు 8,000 మెయిల్స్ అందాయి. వాటిలో సుమారు 4,000 మంది ఏదో ఒక దశలో ఎటర్నల్‌లో పనిచేసినవారే. మిగిలినవారు ఇప్పటివరకు సంస్థలో పని చేయకపోయినా,ఇప్పుడు భాగం కావాలనే ఆసక్తితో సంప్రదించారు.ఈ స్థాయి స్పందనను నేను అసలు ఊహించలేదు. అందులో నిజాయితీ,భావోద్వేగాలు స్పష్టంగా కనిపించాయి.చాలా సంవత్సరాల క్రితం సంస్థను విడిచిన వారిని గురించి ప్రస్తుత ఉద్యోగులకు పెద్దగా తెలిసే అవకాశం లేదు.అందుకే ప్రతి మెయిల్‌ను చదివి,సరైన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత నాదే.అయితే అన్నింటినీ ఒక్కసారిగా చదవడం నాకు సాధ్యం కావడం లేదు.ప్రతి మెయిల్‌ను పరిశీలిస్తున్నాను,అందుకు కొంత సమయం పడుతుంది.మీరు గతంలో నేరుగా నాతో కలిసి పనిచేసి ఉంటే,సమాధానం కోసం ఎదురుచూస్తుంటే నా నంబర్‌కు వాట్సప్‌లో సందేశం పంపండి''అని గోయల్ పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దీపిందర్ గోయల్ చేసిన ట్వీట్
A quick update on back@eternal.com
— Deepinder Goyal (@deepigoyal) February 11, 2026
Over the last week, we received over 8,000 emails. About 4,000 from people who have been part of the Eternal journey at some point. Rest from people who haven't worked here but want to. Thank you so much for this. I didn't expect this at all.…
వివరాలు
సీఈఓ పదవికి రాజీనామా
ఇదిలా ఉండగా, దీపిందర్ గోయల్ తన సీఈఓ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో Blinkit సీఈఓగా ఉన్న Albinder Dhindsa బాధ్యతలు చేపట్టారు. ఈ మార్పులు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి.