Page Loader
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించనున్న భారత్ : డెలాయిట్‌
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్.. 9 శాతం వృద్ధి తప్పనిసరి

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించనున్న భారత్ : డెలాయిట్‌

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 08, 2023
05:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ సంపన్న దేశంగా మారబోతోంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, చైనా సరసన నిలవనుంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించనుంది. ఈ మేరకు స్థిరమైన వృద్ధి రేటు మాత్రం చాలా అవసరమవని డెలాయిట్‌ దక్షిణ ఆసియా సీఈఓ అంచనా వేశారు. రానున్న 20 ఏళ్ల పాటు ఏటా 8 నుంచి 9 శాతం మేర వృద్ధి రేటును నమోదు చేస్తే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారనుందని సీఈఓ రోమల్‌ శెట్టి వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని 2047 నాటికి అందుకోగలగాలంటే స్థిరమైన వృద్ధి రేటు తప్పక సాధించాల్సి ఉంటుందన్నారు. కానీ వృద్ధిరేటు స్థిరత్వం సులువైన అంశం కాదని అభిప్రాయపడ్డారు.

details

భారత్‌ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్‌ ముడి చమురు దిగుమతి : సీఈఓ రోమల్‌ శెట్టి

చైనా ప్లస్ వన్ వ్యూహం నుంచి లబ్ధి పొందేందుకు భారత్‌కు చాలా అవకాశాలున్నట్లు ఆయన చెప్పారు. ఒకరకంగా చెప్పాలంటే మరే దేశానికీ ఇలాంటి అవకాశం లేదన్నారు. ఇప్పటికే అంతరిక్ష రంగానికి సంబంధిచి భారతదేశంలో దాదాపుగా 200 స్టార్టప్ సంస్థలున్నట్లు రోమల్ శెట్టి వివరించారు. 2040 కల్లా ఇవి సుమారు 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించనున్నట్లు ఊహించారు. కీలక రంగాలు వ్యవసాయం, అంతరిక్షం, సెమీకండక్టర్‌, విద్యుత్‌ వాహనాల్లోని అద్భుత అవకాశాలను భారత్‌ ఒడిసిపట్టాలన్నారు. ఏటా 16 - 18 వేల కి.మీ రోడ్ల నిర్మాణం జరుగుతోందని, ఈ ప్రక్రియ అభివృద్ధికి, మెరుగైన వాణిజ్యానికి బలం చేకూర్చుతుందన్నారు. భారత్‌ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్‌ ముడి చమురు దిగుమతి మాత్రమేనని శెట్టి అన్నారు.