G-20 Summit : ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్.. 15 ద్వైపాక్షిక భేటీలో పాల్గొననున్న ప్రధాని మోదీ
G-20 శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వరుస ద్వైపాక్షిక చర్చలు చేయనున్నారు. ఈ మేరకు మొత్తంగా 15 రౌండ్ల చర్చలు చేయనున్నారని కేంద్రం వెల్లడించింది. ప్రధాని అధికారిక నివాసంలో ఇవాళ అమెరికా, ఫ్రాన్స్, మారిషస్ సహా బంగ్లాదేశ్ ప్రతినిధులతో వేర్వేరుగా చర్చించనున్నారు. రేపు యూకే, జపాన్, జర్మనీ, ఇటలీ నేతలతో భేటీ కానున్నారు. ఎల్లుండి సదస్సు ముగింపు సమావేశంలో భాగంగా ఫ్రెంచ్ అధినేత మేక్రాన్‌తో లంచ్ మీట్ సందర్భంగా ద్వైపాక్షిక భేటీ జరగనుంది. ఇదే క్రమంలో కెనడా, కొమొరోస్, టర్కీ, యూఏఈ, దక్షిణకొరియా, యురోపియన్ యూనియన్, బ్రెజిల్, నైజీరియా అధినేతలతోనూ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. యురోపియన్ యూనియన్ దేశాలకు చెందిన కీలక దేశాధినేతలు ఈ సదస్సుకు హాజరు కానుండటం గమనార్హం.