
నేడు దిల్లీ వేదికగా మోదీ-బైడెన్ ద్వైపాక్షిక చర్చలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇవాళ దిల్లీ చేరనున్నారు. ఈ మేరకు గురువారం అమెరికాలో గురువారం బయల్దేరిన బైడెన్, శుక్రవారం సాయంత్రం 6.55 గంటలకు దిల్లీ చేరుకోనున్నారు.
అనంతరం భారత్- అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనుంది. ఇందులో భాగంగానే జీఈ( GE-GENERAL ELECTRIC) జెట్ ఇంజన్లు, న్యూక్లియర్ టెక్నాలజీపై పురోగతి సాధించేలా ప్రధానంగా చర్చించనున్నట్లు వైట్ హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ గురువారం ప్రకటించారు.
G-20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న అగ్రరాజ్యధిపతి, నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
ఈనెల 9, 10 తేదీల్లో దిల్లీలో జరిగే ప్రతిష్టాత్మకమైన సమావేశాలకు భారత్ అధ్యక్షత వహిస్తోంది.
DETAILS
భారతదేశంలోనే జెట్ ఇంజిన్ల తయారీకి ఇటీవలే అమెరికా గ్రీన్ సిగ్నల్
గతంలోనే జనరల్ ఎలక్ట్రిక్ (GE) ఏరోస్పేస్ యూనిట్ భారతదేశంలోనే జెట్ ఇంజిన్లను సంయుక్తంగా తయారు చేసేందుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
భారత వైమానిక దళం కోసం ఫైటర్ జెట్‌లకు శక్తినిచ్చే ఇంజిన్‌లను భారత్ లోనే తయారు చేసేందుకు ఇటీవలే అమెరికా సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. ఇవాళ తాజాగా వీటిపై మరింత పురోగతి సాధించనున్నారు.
ఇదే సమయంలో పర్యావరణ మార్పులు, రష్యా -ఉక్రెయిన్ యుద్ధం, ఆర్థిక సహకారం, బహుళపాక్షిక అభివృద్ధి బ్యాంకు సంస్కరణలు, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడం, పేదరికాన్ని జయించడం లాంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని సుల్లివన్ వెల్లడించారు.