Dhoot Transmission IPO: 38% ప్రీమియంతో లిస్టైన షేర్లు.. ఇన్వెస్టర్లకు భారీ లాభం
ఈ వార్తాకథనం ఏంటి
దూథ్ ట్రాన్స్‌మిషన్ షేర్లు నేడు స్టాక్ మార్కెట్‌లో ఘనంగా అరంగేట్రం చేశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో ఒక్కో షేరు రూ.1,200 వద్ద లిస్టయ్యింది. ఇది కంపెనీ IPO ధర రూ.871తో పోలిస్తే 37.77 శాతం అధికం. ఇక బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో రూ.1,193.80 వద్ద షేరు లిస్టయ్యింది. ఇష్యూ ధరతో పోలిస్తే ఇది 37.06 శాతం ప్రీమియం కావడం విశేషం.
వివరాలు
దూథ్ ట్రాన్స్‌మిషన్ ఐపిఓకు భారీ స్పందన
ఆటో విడిభాగాల తయారీ సంస్థ దూథ్ ట్రాన్స్‌మిషన్ IPOకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది.
గత బుధవారం బిడ్డింగ్ చివరి రోజు నాటికి ఈ ఇష్యూ ఏకంగా 74.21 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయింది.
రూ.3,067 కోట్ల విలువైన ఈ IPOలో 2.496 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 185 కోట్లకు పైగా షేర్ల కోసం బిడ్లు వచ్చాయి. ఈ వివరాలను NSE డేటా వెల్లడించింది.
వివరాలు
QIBల వాటా 212.92 రెట్లు సబ్‌స్క్రైబ్
దూథ్ ట్రాన్స్‌మిషన్ IPOలో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIBs) వాటా ఏకంగా 212.92 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.
నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (NIIs) వాటా 51.93 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 8.12 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.
IPOకు ముందు దూథ్ ట్రాన్స్‌మిషన్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.918.3 కోట్లను సమీకరించింది.
బ్లాక్‌రాక్, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, SBI మ్యూచువల్ ఫండ్స్ వంటి ప్రముఖ సంస్థలు ఇందులో పాల్గొన్నాయి.
దూథ్ ట్రాన్స్‌మిషన్ IPOలో ఒక్కో షేరు ధరను రూ.829 నుంచి రూ.871 మధ్య నిర్ణయించారు.