ఎయిర్ ఇండియాలో డిజిటల్ సిస్టమ్స్ అప్‌గ్రేడ్; చాట్‌జీపీటీ కోసం రూ.1600కోట్ల పెట్టుబడి
టాటాలకు చెందిన ఎయిర్ ఇండియా తన ఎయిర్‌లైన్ డిజిటల్ సిస్టమ్‌లను ఆధునీకరిచాలని నిర్ణయించింది. అందులో భాగంగా చాట్‌జీపీటీ-ఆధారిత చాట్‌బాట్, ఇతర అనేక సాంకేతికతలను ఉపయోగించనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం ఇప్పటికే 200 మిలియన్ల డాలర్ల(రూ.1600కోట్లు) పెట్టుబడిని ఎయిర్ ఇండియా పెట్టింది. రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ పెట్టుబడిని మరింత పెంచాలని ఎయిర్ ఇండియా ఆశిస్తోంది. ఎయిర్ ఇండియా చాలా క్లిష్టమైన ఆప్టిమైజేషన్ సవాళ్లను అధిగమించేందుకు క్వాంటం కంప్యూటింగ్ అప్లికేషన్ వంటి టెక్నాలజీని కూడా పరిశీలించాలని చూస్తోంది. నాలుగు విమానయాన సంస్థలు టాటా గ్రూప్‌లో భాగంంగా ఉన్నాయి. అవి ఏఐఎక్స్ కనెక్ట్, విస్తారా (సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో జాయింట్ వెంచర్), ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్.
ఎయిర్ ఇండియా కస్టమర్ల కోసం కొత్త టెక్నాలజీ సిస్టమ్స్
ఎయిర్‌లైన్ తన కస్టమర్‌ల కోస, యూజర్ ఫ్రెండ్లీ కస్టమర్ నోటిఫికేషన్‌ల సిస్టమ్, వెబ్‌సైట్, మొబైల్ యాప్ ఆధునీకరణ, చాట్ జీటిపీతో నడిచే చాట్‌బాట్, కస్టమర్ సర్వీస్ పోర్టల్, ఇన్-ఫ్లైట్-ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ ఆధునికీకరణ వంటి కొత్త సాంకేతిక వ్యవస్థలను అమలు చేస్తోంది. ఇటువంటి వ్యవస్థలు కాంటాక్ట్ సెంటర్ ఆధునికీకరణ, డిజిటల్ మార్కెటింగ్, ట్రబుల్ మేనేజ్‌మెంట్, స్వీయ-సేవ రీ-అకామడేషన్, స్టడీ, క్లయింట్ ఫీడ్‌బ్యాక్ కోసం ఉపయోగించబడతాయి. ఎయిర్ ఇండియా కార్యాచరణ పురోగతి కోసం, ప్రయాణీకుల ఉత్తమ సేవలు అందించడం కోసం, డిపార్చర్ కంట్రోల్ సిస్టమ్, టర్నరౌండ్ మేనేజ్‌మెంట్, ఇంధన నిర్వహణ, సేల్స్ సిస్టమ్, ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ వంటి విభిన్న వ్యవస్థలను ఆధునీకరిస్తోంది.