
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు భారీ నష్టాలు: వదిలేసిన కోటికి మందికి పైగా సబ్ స్క్రయిబర్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియాలో నంబర్ వన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గా వెలుగొందుతున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు తీవ్రంగా నష్టాలు వచ్చాయి.
ఏకంగా కోటికి పైగా పెయిడ్ సబ్ స్క్రయిబర్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ను వదిలేసి వెళ్ళిపోయారు.
ఏప్రిల్ - జూన్ నెలలో మొత్తం 12.5మిలియన్ల పెయిడ్ సబ్ స్క్రయిబర్లను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోల్పోయింది. ఇంత పెద్ద మొత్తంలో సబ్ స్క్రయిబర్లను కోల్పోవడం ఇదే మొదటిసారి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ డిజిటల్ ప్రసారాలు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు దక్కకపోవడం వల్లే ఇంత మొత్తంలో సబ్ స్క్రయిబర్లు కోల్పోయి ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
Details
యాడ్ ఫీ సబ్ స్క్రిప్షన్ ఫీజు పెంపు
పెద్ద మొత్తంలో సబ్ స్క్రయిబర్ల ను కోల్పోవడంపై స్పందించిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సీఈవో బాబ్ ఇగార్, కంపెనీకి లాభాలను తీసుకొచ్చే ఆలోచనల కోసం చూస్తున్నామని తెలియజేసారు.
మరికొద్ది రోజుల్లో యాడ్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ ఫీజును పెంచే అవకాశం ఉందని ఆయన అన్నారు.
గతకొన్ని రోజులుగా వైరల్ అవుతున్న విషయం ఏంటంటే, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నవారికి పాస్ వర్డ్ షేరింగ్ విషయంలోనూ పరిమితులు నున్నాయట. ఈ విషయమై డిస్నీప్లస్ హాట్ స్టార్ యాజమాన్యం ఇంకా స్పందించలేదు.
ప్రస్తుతానికి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 146.1మిలియన్ల సబ్ స్క్రయిబర్లనున్ కలిగి ఉంది.