
Google Pixel 8: భారతదేశంలో గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేయనున్నడిక్సన్ టెక్నాలజీస్
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ తన మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఇంకో కొత్త ప్రొడక్ట్ ను తేనుంది. ఇందుకు భారతదేశంలోని స్థానిక తయారీదారు డిక్సన్ టెక్నాలజీస్‌ను ఎంచుకుంది.
డిక్సన్ హై-ఎండ్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్‌లను ఉత్పత్తి చేయడంలో పేరు గాంచింది.
ఇప్పటికే ట్రయల్ ప్రొడక్షన్ దశ కొనసాగుతోందని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది.
ఈ మేడ్-ఇన్-ఇండియా పరికరాల మొదటి బ్యాచ్ సెప్టెంబర్ నాటికి మార్కెట్‌లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.
భారతదేశంలో ఉత్పత్తి చేయాలనే గూగుల్ నిర్ణయం దేశీయ మార్కెట్ అవసరాలు తీర్చాలన్నదే ప్రాధమిక లక్ష్యం. అవి తీరాకే డిమాండ్లకు అనుగుణంగా,ఎగుమతులు చేయాలని నిర్ధేశించుకుంది.
మార్కెటింగ్ స్ట్రాటజీ
చైనా గుత్తాధిపత్యానికి గూగుల్ అడ్డుకట్ట
స్మార్ట్‌ఫోన్ ల తయారీలో చైనాదే ఇప్పటి వరకు పై చేయిగా ఉంది.ఇబ్బడి ముబ్బిడిగా మన దేశీయ మార్కెట్లో ఎక్కడ చూసినా చైనా ఫోన్ లు కనిపిస్తుంటాయి.
గూగుల్..చైనాను పక్కన పెట్టి తన స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నిస్తోంది.ఈ దిశగా అడుగులు వేస్తుంది.
దీంతో పాటుగా ఏప్రిల్,జూన్ మధ్య కాలంలో భారతదేశంలో పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీని ప్రారంభించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తోంది.
దీనిని ఓ శుభ పరిణామంగా స్మార్ట్‌ఫోన్ తయారీదారులు అభివర్ణించారు.ఈ నిర్ణయం చైనాతో సంబంధం లేకుండా భారతదేశం అభివృద్ధికి నిదర్శనంగా చెప్పాలి.
దీంతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి టెక్ దిగ్గజం చిత్త శుద్ధిని మరో మారు ఖరారు చేసింది.
డిక్సన్ టెక్నాలజీస్‌ను ఖరారు చేసే ముందు, వివిధ ఉత్పాదక భాగస్వాములతో విసృతంగా చర్చింది.
డిజిటల్ గ్రోత్
Google CEO సుందర్ పిచాయ్ చెప్పిందే జరుగుతోంది
ఇందుకు ఓ ఏడాది సమయం పట్టింది.డిక్సన్ టెక్నాలజీస్ నోయిడాలో ఉన్న NSE-లిస్టెడ్ భారతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ సేవల సంస్థ.
ఈ నిర్ణయాలన్నీ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మునుపటి ప్రకటనకు అనుగుణంగా ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా 2024లో మొదటి పరికరం మార్కెట్లోకి విడుదల కానుందని పిచాయ్ చెప్పారు.
భారతదేశం డిజిటల్ వృద్ధిలో విశ్వసనీయ భాగస్వామిగా ఉండటానికి మేము కట్టుబడి ఉన్నామని Google CEO అప్పట్లో తెలిపారు.
మేక్ ఇన్ ఇండియాకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ఆయన చెప్పారు.సుందర్ పిచాయ్.. తన భారత్ పర్యటనలో చెప్పిన మాటలు ఇప్పడిప్పుడే కార్యరూపం దాలుస్తున్నాయి.
భారతదేశం డిజిటల్ విస్తరణకు మద్దతు , సాంకేతిక సహకారం అందించడంలో Google చిత్తశుద్ధి ,నిబద్ధతకు దీనిని ఓ సంకేతంగా పరిగణించాలి.