LOADING...
Unclaimed insurance amount: మీ పేరుమీద అన్‌క్లెయిమ్డ్‌ బీమా ఫండ్స్ ఉన్నాయి? ఇలా చెక్ చేసుకోండి!
మీ పేరుమీద అన్‌క్లెయిమ్డ్‌ బీమా ఫండ్స్ ఉన్నాయి? ఇలా చెక్ చేసుకోండి!

Unclaimed insurance amount: మీ పేరుమీద అన్‌క్లెయిమ్డ్‌ బీమా ఫండ్స్ ఉన్నాయి? ఇలా చెక్ చేసుకోండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2025
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీమా పాలసీ తీసుకున్న విషయం పాలసీదారుడు మరిచిపోవడం, లేదా అలాంటి పాలసీ ఒకటి ఉందనే విషయం నామినీలకు తెలియకపోవడం వంటి కారణాలతో కోట్లాది రూపాయలు బీమా కంపెనీల వద్ద అన్‌క్లెయిమ్డ్‌ అమౌంట్లుగా నిలిచిపోతున్నాయి. వివిధ బీమా సంస్థల వద్ద ఈ విధంగా సుమారు రూ.25 వేల కోట్ల వరకు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. చాలా మంది ప్రజల అవగాహన లోపం, పేపర్‌ డాక్యుమెంట్లు పోగొట్టుకోవడం వంటివి కూడా ఈ మొత్తాలు క్లెయిమ్‌ కాకుండా ఉండడానికి ప్రధాన కారణాలు. అయితే అలాంటి మొత్తాలు మీ పేరుమీద ఉన్నాయా? ఉంటే వాటిని ఎలా పొందాలి?

Details

అన్‌క్లెయిమ్డ్‌ మొత్తం అంటే ఏమిటీ?

బీమా కంపెనీ చెల్లించాల్సిన క్లెయిమ్‌, లాభం లేదా రీఫండ్‌ను వినియోగదారునితో సంప్రదించలేకపోతే, ఆ మొత్తం 12 నెలలకు పైగా పెండింగ్‌లో ఉంటే, దాన్ని అన్‌క్లెయిమ్డ్‌ మొత్తంగా పరిగణిస్తారు. ఈ మొత్తాలు ఎక్కువగా ఈ సందర్భాల్లో పేరుకుపోతుంటాయి: డెత్‌ క్లెయిమ్‌లు హెల్త్‌ బెనెఫిట్స్‌ మెచ్యూరిటీ అమౌంట్లు సర్వైవల్ బెనెఫిట్స్‌ సరెండర్‌/ముందస్తు ఉపసంహరణ అధిక ప్రీమియం చెల్లింపులు

Details

మీ పేరుమీద అన్‌క్లెయిమ్డ్‌ అమౌంట్ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి?

ప్రతి బీమా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా Unclaimed Amounts కోసం విభాగం ఉంటుంది. అక్కడ మీ పాలసీ వివరాలు ఎంటర్‌ చేస్తే సమాచారం లభిస్తుంది. అదే విధంగా, బీమా నియంత్రణ సంస్థ IRDAIరూపొందించిన Bhima Bharosaపోర్టల్ ద్వారా కూడా చెక్‌ చేసుకోవచ్చు. ఈ పోర్టల్‌లో అన్ని జీవిత, ఆరోగ్య బీమా కంపెనీల లింకులు ఒకే చోట కనిపిస్తాయి. సంబంధిత బీమా కంపెనీ పేరును క్లిక్‌ చేస్తే, ఆ కంపెనీ అధికారిక సైట్‌కు రీడైరెక్ట్‌ అవుతారు. అక్కడ పాలసీదారుడి పేరు, పుట్టిన తేదీ, PANపాలసీ నంబర్‌ వంటి వివరాలు ఎంటర్ చేయాలి. కనీసం రెండు వివరాలు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. డేటాలో మ్యాచ్‌ అయితే... వెంటనే అన్‌క్లెయిమ్డ్‌ అమౌంట్‌ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

Details

అన్‌క్లెయిమ్డ్‌ అమౌంట్ పొందడానికి అవసరమైన డాక్యుమెంట్లు 

పాలసీ హోల్డర్, నామినీ లేదా చట్టబద్ధ వారసుడు—ఎవరైనా సరైన పత్రాలు సమర్పించి అన్‌క్లెయిమ్డ్‌ మొత్తాన్ని పొందవచ్చు. అందుకు అవసరమైనవి: పాలసీ డాక్యుమెంట్‌ లేదా పాలసీ వివరాలు బ్యాంక్‌ ఖాతా వివరాలు * ఫోటో ఐడీ ప్రూఫ్‌ బ్యాంక్‌ పాస్‌బుక్‌ కేవైసీ డాక్యుమెంట్లు అడ్రస్‌ ప్రూఫ్‌ క్లెయిమ్‌ ఫారమ్‌ మరణ ధ్రువీకరణ పత్రం (డెత్‌ క్లెయిమ్‌లకు) హాస్పిటల్‌ రికార్డులు (హెల్త్‌ క్లెయిమ్‌లకు అవసరమైతే) పోర్టల్‌ ద్వారా లేదా కంపెనీ వెబ్‌సైట్ ద్వారా అన్‌క్లెయిమ్డ్‌ మొత్తముందని నిర్ధారించిన తర్వాత, సంబంధిత బీమా కంపెనీని సంప్రదించి పత్రాలు సమర్పిస్తే, ఏవైనా న్యాయపర సమస్యలు లేకపోతే ఆ మొత్తాన్ని మీ అకౌంట్‌లో జమ చేస్తారు. ఎన్‌ఆర్‌ఐలు కూడాBhima Bharosaపోర్టల్‌ ద్వారా అన్‌క్లెయిమ్డ్‌ అమౌంట్లను చెక్‌ చేసి క్లెయిమ్‌ చేసుకోవచ్చు.