LOADING...
Loans: మీ పేరుపై ఎన్ని లోన్లు ఉన్నాయో తెలుసా? తెలుసుకునే సులభ మార్గాలివే!
మీ పేరుపై ఎన్ని లోన్లు ఉన్నాయో తెలుసా? తెలుసుకునే సులభ మార్గాలివే!

Loans: మీ పేరుపై ఎన్ని లోన్లు ఉన్నాయో తెలుసా? తెలుసుకునే సులభ మార్గాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 29, 2025
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్యాంకులు, బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు (NBFCలు), డిజిటల్‌ లెండర్ల ద్వారా అనేక మంది తమ అవసరాల కోసం లోన్లు, క్రెడిట్‌ కార్డులు తీసుకుంటుంటారు. రుణాల మంజూరులో సిబిల్‌ స్కోర్‌, వ్యక్తిగత క్రెడిట్‌ ప్రొఫైల్‌ను ప్రధాన ప్రమాణాలుగా పరిగణలోకి తీసుకుంటారు. డిజిటల్‌ లావాదేవీలు విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో పాన్‌ కార్డు ఆధారంగా మోసాలు కూడా అధికమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మీ పేరుపై ఎన్ని లోన్లు ఉన్నాయో తెలుసుకోవడం ఎంతో అవసరం. పాన్‌ కార్డు నంబర్‌తో ఈ వివరాలను సులభంగా చెక్‌ చేసుకునే మార్గాలు ఇవి.

Details

స్టెప్‌-1: క్రెడిట్‌ రిపోర్ట్‌ పొందడం

సిబిల్‌, ఎక్స్‌పీరియన్‌, ఈక్విఫాక్స్‌, CRIF హైమార్క్‌ వంటి క్రెడిట్‌ బ్యూరో సంస్థల ద్వారా మీ క్రెడిట్‌ రిపోర్ట్‌ను పొందవచ్చు. పాన్‌ కార్డు వివరాలు ఇచ్చి ఫ్రీ యాన్యువల్‌ క్రెడిట్‌ రిపోర్ట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందులో మీ పేరుపై ఉన్న యాక్టివ్‌ లోన్లు, క్రెడిట్‌ కార్డులు, లోన్‌ మొత్తాలు, లెండర్ల వివరాలు, రీపేమెంట్‌ స్టేటస్‌ వంటి అన్ని సమాచారం స్పష్టంగా తెలుస్తుంది.

Details

స్టెప్‌-2: ఫిన్‌టెక్‌ యాప్స్‌ వినియోగం 

వన్‌ స్కోర్‌, పేటీఎమ్‌, క్రెడ్‌ వంటి ఫిన్‌టెక్‌ యాప్స్‌లో పాన్‌ కార్డు లింక్‌ చేయడం ద్వారా మీ లోన్‌, క్రెడిట్‌ కార్డు వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. స్టెప్‌-3: డిజీలాకర్‌ + CKYC డేటా క్రెడిట్‌ యాన్యువల్‌ రిపోర్ట్‌లో మీ పేరుపై ఉన్న అన్ని లోన్ల వివరాలను జాగ్రత్తగా చెక్‌ చేయాలి. మీకు తెలియని లోన్లు లేదా అనుమానాస్పద ఎంట్రీలు కనిపిస్తే వెంటనే సంబంధిత క్రెడిట్‌ బ్యూరో లేదా బ్యాంకును సంప్రదించి ఫిర్యాదు చేయాలి. సిబిల్‌ స్కోర్‌ అకస్మాత్తుగా తగ్గిపోవడం, గుర్తు తెలియని బ్యాంక్‌ అకౌంట్లు లేదా లోన్లు రిపోర్ట్‌లో కనిపిస్తే ఆలస్యం చేయకుండా రిపోర్ట్‌ చేయడం తప్పనిసరి.

Advertisement

Details

 పాన్‌ కార్డు మోసాల నుంచి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

అన్‌సెక్యూర్డ్‌ వెబ్‌సైట్లు, గుర్తు తెలియని ఏజెంట్లతో పాన్‌ కార్డు వివరాలను షేర్‌ చేసుకోకూడదు. అవసరం లేకుండా తరచుగా పాన్‌ కార్డు వివరాలు పంచుకోవడం మానుకోవాలి. సాధారణంగా బ్యాంకులు సెక్యూర్డ్‌, అన్‌సెక్యూర్డ్‌ లోన్లు మంజూరు చేస్తాయి. లోన్‌ తీసుకునే ముందు సిబిల్‌ స్కోర్‌, క్రెడిట్‌ రిపోర్ట్‌ పరిస్థితి, వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్‌ ఫీజులు వంటి అంశాలతో పాటు ఇతర షరతులను కూడా సమగ్రంగా పరిశీలించుకోవడం అవసరం.

Advertisement