Loading...
Nvidia CEO Jensen Huang: ఏఐతో మానవాళికి ప్రమాదమా..? ఎన్విడియా సీఈఓ కీలక వ్యాఖ్యలు!
ఏఐతో మానవాళికి ప్రమాదమా..? ఎన్విడియా సీఈఓ కీలక వ్యాఖ్యలు!

Nvidia CEO Jensen Huang: ఏఐతో మానవాళికి ప్రమాదమా..? ఎన్విడియా సీఈఓ కీలక వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 19, 2026
02:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

కృత్రిమ మేధ (AI)పై ఎన్విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 2030 నాటికి ఏఐ కారణంగా ప్రపంచం అంతమవుతుందన్న వాదనలను ఆయన తోసిపుచ్చారు. అలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం లేదని పేర్కొన్నారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెన్సన్‌ హువాంగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఈ దశాబ్దం చివరి నాటికి ఏఐ వల్ల మానవాళి అంతమవుతుందన్న వాదనల్లో అర్థం లేదు. ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. ఏఐ వల్ల ప్రమాదం ఉందన్న వార్తల కారణంగా పలు కంపెనీలు కృత్రిమ మేధ అభివృద్ధిని నెమ్మదించడం సరికాదు. తమ సిస్టమ్‌ల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. అదే విధంగా అసురక్షితంగా భావించే సిస్టమ్‌లను విడుదల చేయకూడదు.

వివరాలు

ఏఐ అభివృద్ధి వేగానికి ఇకనైనా కళ్లెం వేయాలి

ఇతరులతో సంబంధం లేకుండా సాధ్యమైనంత వేగంగా ఏఐ వైపు పయనించాలని ఎన్విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ సూచించారు.

మరోవైపు, ఏఐ కారణంగా రానున్న పదేళ్లలో 10 శాతానికిపైగా మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆంథ్రోపిక్‌కు చెందిన పరిశోధకుడు ఇవాన్‌ హుబింగర్‌ ఇటీవల పేర్కొన్నారు.

ఏఐ అభివృద్ధి వేగానికి ఇకనైనా కళ్లెం వేయాలని ఆంథ్రోపిక్‌ సీఈఓ డారియో అమోడెయ్‌, ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌, ఎక్స్‌ ఏఐ అధిపతి ఎలాన్‌ మస్క్‌ అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో ఏఐపై ఎన్విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ADVERTISEMENT