
Flight charges: దేశీయ విమాన చార్జీలు 30శాతం వరకు ఎందుకు పెరిగాయి?
ఈ వార్తాకథనం ఏంటి
విమాన ప్రయాణం ప్రియమైపోతోంది. కొన్ని రూట్లలో పెరిగిన విమాన ప్రయాణ చార్జీలే అందుకు నిదర్శనం.
ఇప్పడు కొనసాగుతున్న విస్తారా సంక్షోభం అందుకు కొంత దోహదమైంది.
విమాన సర్వీసులను 10శాతం మేర తగ్గించేయడం వంటి చర్యలతో విమాన టికెట్ల చార్జీలకు రెక్కలొచ్చాయి.
ట్రావెల్ ప్లాట్ ఫామ్ యాత్ర ఆన్ లైన్, ఇగ్జిగో లు కొన్ని రూట్లలో విమాన ప్రయాణానికి 8 నుంచి 30 శాతం వరకు రేట్లు పెంచాయి.
ఢిల్లీ -గోవా, ఢిల్లీ-కొచ్చి, ఢిల్లీ-జమ్ము, ఢిల్లీ-శ్రీనగర్ వంటి రూట్లలో 20 నుంచి 25 శాతం వరకూ టికెట్ రేట్లు పెంచి అమ్ముతున్నట్లు యాత్ర ఆన్ లైన్ వద్ద ఎయిర్ అండ్ హోటల్ బిజినెస్ సంస్థకు చెందిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భరత్ మాలిక్ తెలిపారు.
Flight charges Hike
పైలట్ల సమ్మె కారణం
విస్టార సంస్థ తన విమాన సర్వీసులను తగ్గించుకోవడమే విమాన టికెట్ల చార్జీలు పెరుగుదలకు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు.
కొత్త జీతాలను సవరించాలని పైలట్లు మెరుపు సమ్మెకు దిగడంతో విస్టారా విమాన సర్వీసుల సంఖ్యను కుదించుకుంది.
రోస్టర్ విధానాన్ని ప్రవేశాలను పెట్టాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ కారణాలతో దేశీయంగా విమాన చార్జీలు ఆకాశన్నంటుతున్నాయి.
అయితే పెరిగిన రెట్లే చాలాకాలం పాటు కొనసాగే అవకాశముందని సంజయ్ లాజర్ తెలిపారు.
ఎందుకంటే వేసవి సీజన్లో టూరిస్టులు, జూన్, జూలై నెలలో విదేశాలకు వెళ్లే విద్యార్థులు ఎక్కువగా ఉండటంతో విమాన ప్రయాణీకుల రద్దీ ఉంటుందని తెలిపారు.
అప్పటివరకూ ఇవే రేట్లు కొనసాగే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.