LOADING...
Weight-Loss Drugs: బరువు తగ్గించే మందులపై కేంద్రం కఠిన చర్యలు
బరువు తగ్గించే మందులపై కేంద్రం కఠిన చర్యలు

Weight-Loss Drugs: బరువు తగ్గించే మందులపై కేంద్రం కఠిన చర్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 24, 2026
03:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధుమేహం, అధిక బరువు నియంత్రణకు ఉపయోగించే ఔషధాల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన దృష్టి సారించింది. ఇటీవల పేటెంట్ గడువు ముగియడంతో జీఎల్‌పీ-1 సెమాగ్లుటైడ్ ఆధారిత జనరిక్ మందులను అనేక కంపెనీలు దేశీయ మార్కెట్లో విస్తృతంగా అందుబాటులోకి తెచ్చాయి. బరువు తగ్గించే మందులుగా వినియోగిస్తున్న ఈ ఉత్పత్తులు రిటైల్ ఫార్మసీలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, టోకు వ్యాపారులు, వెల్‌నెస్ క్లినిక్‌ల ద్వారా సులభంగా లభించడం ఆందోళనకు దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో అనధికారిక అమ్మకాలపై నియంత్రణ కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (CDSCO) చర్యలు ప్రారంభించింది. అంతేకాకుండా ఈ ఔషధాల వినియోగాన్ని ప్రోత్సహించే ప్రకటనలపై కూడా నిషేధం విధించింది.

వివరాలు 

వైద్య పర్యవేక్షణ లేకుండా వాడితే ప్రమాదం

బరువు తగ్గించే ఈ ఔషధాలను వైద్యుల పర్యవేక్షణ లేకుండా వినియోగించడం వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారొచ్చని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా క్లినిక్‌లు, ఆన్‌లైన్ ఫార్మసీ గిడ్డంగులు సహా మొత్తం 49 సంస్థల్లో డ్రగ్ కంట్రోల్ అధికారుల బృందాలు తనిఖీలు నిర్వహించాయి. నిబంధనలు అతిక్రమించిన కొన్ని కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. జీఎల్‌పీ-1 తరహా ఔషధాలను వైద్యుల సూచనతోనే విక్రయించాలని కేంద్రం స్పష్టంగా ఆదేశించింది.

Advertisement