Loading...
Dubai property: దుబాయ్ రియల్ ఎస్టేట్ మళ్లీ ఊపందుకుంటోంది.. గోల్డెన్ వీసాపై ఆసక్తి పెరుగుతోంది
గోల్డెన్ వీసాపై ఆసక్తి పెరుగుతోంది

Dubai property: దుబాయ్ రియల్ ఎస్టేట్ మళ్లీ ఊపందుకుంటోంది.. గోల్డెన్ వీసాపై ఆసక్తి పెరుగుతోంది

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2026
04:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రాంతీయ భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా గత కొన్ని నెలలుగా మందగించిన దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ కోలుకునే దిశగా అడుగులు వేస్తోంది. అయితే గత ఏడాదితో పోలిస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) గోల్డెన్ వీసా పథకానికి సంబంధించిన విచారణలు (ఇన్‌క్వైరీలు) ఇంకా పూర్తిస్థాయిలో పుంజుకోలేదని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ల ప్రకారం,ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా విదేశీ పెట్టుబడిదారులు కొంతకాలం పెట్టుబడి నిర్ణయాలను వాయిదా వేసినప్పటికీ, దుబాయ్ ప్రాపర్టీలపై డిమాండ్ మాత్రం పూర్తిగా తగ్గిపోలేదు. ప్రస్తుతం కొనుగోలుదారులు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తూ, ధరలపై ఎక్కువగా చర్చలు జరుపుతూ, నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నారు.

వివరాలు 

తాత్కాలికంగా తగ్గిన  గోల్డెన్ వీసా సంప్రదింపులు

పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుతుండటంతో రాబోయే నెలల్లో ప్రాపర్టీ కొనుగోళ్లు, గోల్డెన్ వీసా విచారణలు రెండూ పెరుగుతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఎంసీఏ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్స్ దుబాయ్ కార్పొరేట్ సర్వీసెస్ డైరెక్టర్ స్నేహా శెట్టి మాట్లాడుతూ, పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు,నిపుణులకు యూఏఈ ఇప్పటికీ అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఉందన్నారు.

గోల్డెన్ వీసా పథకానికి దీర్ఘకాలంలో ఉన్న ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదని ఆమె పేర్కొన్నారు.

అయితే గత ఏడాదితో పోలిస్తే గోల్డెన్ వీసాపై వచ్చిన సంప్రదింపులు తాత్కాలికంగా తగ్గాయని ఆమె పేర్కొన్నారు.

ప్రాంతీయ స్థిరత్వం, ప్రయాణాలు, పెట్టుబడులపై ఉన్న అనిశ్చితి కారణంగా చాలామంది 'వేచి చూద్దాం' అనే ధోరణి అవలంబిస్తున్నారని చెప్పారు.

పరిస్థితులు పూర్తిగా చక్కబడితే పెట్టుబడిదారుల విశ్వాసం మళ్లీ పెరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

వివరాలు 

రియల్ ఎస్టేట్‌లో AED 2 మిలియన్ పెట్టుబడి పెట్టిన వారికి గోల్డెన్ వీసా

యూఏఈలో కనీసం 20 లక్షల దిర్హామ్‌లు (AED 2 మిలియన్) విలువైన రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టిన వారికి ప్రభుత్వం 10 సంవత్సరాల గోల్డెన్ వీసా మంజూరు చేస్తోంది.

దీర్ఘకాల నివాస అనుమతి పొందాలనుకునే విదేశీ పెట్టుబడిదారులకు ఈ పథకం ప్రధాన ఆకర్షణగా మారింది.

ఇన్‌క్వైరీలు తగ్గినప్పటికీ ప్రాపర్టీ కొనుగోళ్లు మాత్రం పూర్తిగా ఆగలేదని దుబాయ్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సలహాదారు అబ్దుల్ రహీమ్ తెలిపారు.

ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా లావాదేవీలు కొనసాగాయని, అయితే కొనుగోలుదారులు తమకు అనుకూలమైన ధరలకే కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని చెప్పారు.

లావాదేవీల సంఖ్య కొంత తగ్గినా, కొనుగోలు ఆసక్తి మాత్రం కొనసాగిందని వివరించారు.

ADVERTISEMENT

వివరాలు 

నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులు పూర్తికాకముందే.. పెట్టుబడిదారులు వాటిని విక్రయించారు 

మార్కెట్ మందగమనానికి కేవలం ప్రాంతీయ ఉద్రిక్తతలే కారణం కాదని రహీమ్ అభిప్రాయపడ్డారు.

గత కొన్నేళ్లుగా దుబాయ్ ప్రాపర్టీ ధరలు భారీగా పెరగడంతో మార్కెట్‌లో సహజంగానే కొంత స్థిరీకరణ రావడం అనివార్యమని ఆయన అన్నారు.

2022-23మధ్య నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులు పూర్తికాకముందే పెట్టుబడిదారులు వాటిని విక్రయించి భారీ లాభాలు పొందారు.

కరోనా కాలంలో కొనుగోలు చేసినవారు కూడా మంచి లాభాలతో బయటకు రావడంతో ఊహాజనిత పెట్టుబడులు పెరిగాయని,అయితే అలాంటి పరిస్థితి ఎప్పటికీ కొనసాగడం సాధ్యం కాదని పేర్కొన్నారు.

ధరలు ఎప్పటికీ పెరుగుతూనే ఉండవని,ప్రతి మార్కెట్‌లో ఒక దశలో సవరణ రావడం సహజమని రహీమ్ చెప్పారు.

ప్రస్తుతం పెట్టుబడిదారులు తొందరపడి కొనుగోలు చేయకుండా,ప్రాజెక్టులను పూర్తిగా పరిశీలించి, ధరలపై చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటున్నారని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

55 శాతం తగ్గిన దుబాయ్‌లో ప్రాపర్టీ లావాదేవీల విలువ

యూబీపీ (UBP) గణాంకాల ప్రకారం, 2025 డిసెంబర్ నుంచి 2026 మే మధ్య దుబాయ్‌లో ప్రాపర్టీ లావాదేవీల విలువ 55 శాతం తగ్గింది.

ఇప్పటికే పూర్తయిన ప్రాపర్టీల లావాదేవీలు 49 శాతం తగ్గగా, నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టుల (ఆఫ్-ప్లాన్) లావాదేవీలు 58 శాతం మేర క్షీణించాయి.

2026 రెండో త్రైమాసికంలో దుబాయ్‌లో నివాస గృహాల విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 29 శాతం తగ్గి సుమారు 37 వేల విక్రయాలకు చేరుకున్నాయి.

గత ఏడాది ఇదే కాలంలో ఇవి 51 వేలకుపైగా ఉండేవి. మొత్తం లావాదేవీల విలువ కూడా 154 బిలియన్ దిర్హామ్‌ల నుంచి 88 బిలియన్ దిర్హామ్‌లకు తగ్గింది.

వివరాలు 

ఇప్పటికీ విదేశీ పెట్టుబడిదారులకు ప్రధాన ఆకర్షణగా గోల్డెన్ వీసా

అయినప్పటికీ గోల్డెన్ వీసా ఇప్పటికీ విదేశీ పెట్టుబడిదారులకు ప్రధాన ఆకర్షణగానే కొనసాగుతోందని స్నేహా శెట్టి తెలిపారు.

స్థిరత్వం, తక్కువ పన్ను భారం, దీర్ఘకాల నివాస అవకాశాల కోసం కుటుంబాలతో కలిసి యూఏఈకి రావాలనుకునే వారికి ఈ పథకం కీలకంగా మారిందన్నారు.

ప్రస్తుతం పెట్టుబడిదారులు కేవలం మరింత ఎంపిక చేసుకుని, నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నారని చెప్పారు.

20 లక్షల దిర్హామ్‌ల పెట్టుబడి అర్హత నిబంధన విదేశీ పెట్టుబడిదారులను ఇప్పటికీ ఆకర్షిస్తోందని ఆమె పేర్కొన్నారు.

దుబాయ్‌ను తాత్కాలిక లాభాల మార్కెట్‌గా కాకుండా దీర్ఘకాల పెట్టుబడి కేంద్రంగా చాలామంది చూస్తున్నారని వివరించారు.

వివరాలు 

దుబాయ్ ప్రాపర్టీ మార్కెట్‌లో భారతీయులే అత్యధికంగా పెట్టుబడులు

అబ్దుల్ రహీమ్ అంచనా ప్రకారం,దుబాయ్‌లో జరిగే మొత్తం ప్రాపర్టీ కొనుగోళ్లలో సుమారు 20 నుంచి 30 శాతం వరకు గోల్డెన్ వీసా అర్హతతో సంబంధం ఉంటుంది.

అయితే కేవలం వీసా కోసమే కాకుండా,అద్దె ఆదాయం,భవిష్యత్‌లో ఆస్తి విలువ పెరగడం వంటి అంశాలను కూడా పెట్టుబడిదారులు పరిగణనలోకి తీసుకుంటున్నారని చెప్పారు.

దుబాయ్‌లో సాధారణంగా అద్దెపై 6 నుంచి 7 శాతం వరకు రాబడి లభిస్తుండగా,సరైన ధరలో కొనుగోలు చేసిన ప్రాపర్టీలకు అది 9 నుంచి 10 శాతం వరకు చేరే అవకాశముందని తెలిపారు.

దుబాయ్ ప్రాపర్టీ మార్కెట్‌లో భారతీయులే ఇప్పటికీ అత్యధికంగా పెట్టుబడులు పెడుతున్నారని రహీమ్ వెల్లడించారు.

వారి తర్వాత యునైటెడ్ కింగ్‌డమ్, చైనా వంటి దేశాలకు చెందిన పెట్టుబడిదారులు ఉన్నారని చెప్పారు.

వివరాలు 

భౌగోళిక పరిస్థితులు స్థిరంగా కొనసాగితే..

ప్రస్తుతం ఏ ప్రాంతంలో కొనాలి అన్నదానికంటే, అద్దె ఆదాయం కావాలా, ఆస్తి విలువ పెరగాలా, లేక స్వయంగా నివసించాలా అనే పెట్టుబడి లక్ష్యాల ఆధారంగానే కొనుగోలు నిర్ణయాలు తీసుకుంటున్నారని వివరించారు.

భౌగోళిక పరిస్థితులు స్థిరంగా కొనసాగితే రాబోయే నెలల్లో దుబాయ్ ప్రాపర్టీ మార్కెట్ మరింత బలపడుతుందని మార్కెట్ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

గతంలోనూ ప్రపంచ, ప్రాంతీయ సంక్షోభాల నుంచి దుబాయ్ వేగంగా కోలుకున్న చరిత్ర ఉందని స్నేహా శెట్టి గుర్తు చేశారు.

వివరాలు 

మార్కెట్ పూర్తిస్థాయిలో మళ్లీ పుంజుకోవడానికి ఒకటి నుంచి రెండు సంవత్సరాలు

పెట్టుబడిదారులకు అనుకూల విధానాలు, బలమైన వ్యాపార వాతావరణం, ఆధునిక మౌలిక సదుపాయాలు, దీర్ఘకాల నివాస అవకాశాలు భవిష్యత్తులో కూడా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

అబ్దుల్ రహీమ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మార్కెట్ పూర్తిస్థాయిలో మళ్లీ పుంజుకోవడానికి ఒకటి నుంచి రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉందన్నారు.

అయినప్పటికీ దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు బలమైన పునాది ఉందని, తాత్కాలిక పరిణామాల కంటే దీర్ఘకాల అవకాశాలపైనే పెట్టుబడిదారులు దృష్టి పెట్టాలని సూచించారు.

ADVERTISEMENT