NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ఆర్థిక సర్వే 2023: బడ్జెట్ వేళ ఆర్థిక సర్వే ప్రాముఖ్యతను తెలుసుకోండి
    బిజినెస్

    ఆర్థిక సర్వే 2023: బడ్జెట్ వేళ ఆర్థిక సర్వే ప్రాముఖ్యతను తెలుసుకోండి

    ఆర్థిక సర్వే 2023: బడ్జెట్ వేళ ఆర్థిక సర్వే ప్రాముఖ్యతను తెలుసుకోండి
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 31, 2023, 02:20 pm 1 నిమి చదవండి
    ఆర్థిక సర్వే 2023: బడ్జెట్ వేళ ఆర్థిక సర్వే ప్రాముఖ్యతను తెలుసుకోండి
    ఆర్థిక సర్వే 2023ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

    కేంద్ర బడ్జెట్-2023 సమావేశాలు మంగళవారం ప్రారంభయ్యమాయి. ఈ క్రమంలో 'ఆర్థిక సర్వే 2023'ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ఆర్థిక సర్వేను నిర్మల లోక్‌సభ ముందుంచారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆర్థిక సర్వే ప్రముఖ్యత, చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం. గత ఆర్థిక సంవత్సరంలో జరిగిన అభివృద్ధికి సంబంధించిన సమాచారాన్ని ఆర్థిక సర్వే క్రోడీకరించి అందిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది రోడ్ మ్యాప్ లాంటిది అన్నమాట. భారత ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం పరిస్థితి , ఎగుమతులు, దిగుమతులు, మారక నిల్వలు, పారిశ్రామికాభివృద్ధి ఇలా అనేక రంగాలను విశ్లేషించి ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) ఆధ్వర్యంలో ఆర్థిక సర్వే రిపోర్టును తయారు చేస్తారు.

    1960నుంచి కొనసాగుతున్న ఆనవాయితీ

    మొదటి ఆర్థిక సర్వే 1950-51లో ప్రవేశ పెట్టారు. అప్పుడు బడ్జెట్‌తో కలిపి సర్వేను ప్రవేశ‌పెట్టే వారు. 1960లో బడ్జెట్ పత్రాల నుంచి ఆర్థిక సర్వేను వేరు చేశారు. బడ్జెట్‌కు ఒక‌రోజు ముందు సమర్పించడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఆ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. గతంలో ఆర్థిక సర్వేను ఒక వాల్యూమ్‌గా సిద్ధం చేసేవారు. వ్యవసాయ, తయారీ రంగాలు, ఆర్థిక పరిణామాలు, ద్రవ్యోల్బణం వంటి కీలక అంశాల గురించి, వాటి పాలసీల గురించి విపులంగా ఒక వాల్యూమ్‌లో చెప్పడం కష్టమవుతుందని 2010-11 నుంచి ఆర్థిక సర్వేను రెండు వాల్యూమ్‌లు సిద్ధం చేయడం ప్రారంభించారు. సీఈఏగా అనంత నాగేశ్వరన్ బాధ్యతలు చేపట్టాక గత బడ్జెట్ నుంచి సర్వేను తిరిగి ఒక వాల్యూమ్‌గా ముద్రిస్తున్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    నిర్మలా సీతారామన్
    ఆర్థిక శాఖ మంత్రి
    బడ్జెట్
    ఆర్థిక సంవత్సరం

    తాజా

    మార్చి 23న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    అమరవీరుల దినోత్సవం 2023: సంవత్సరంలో రెండుసార్లు జరుపుకునే దీని ప్రత్యేకత మీకు తెలుసా? ముఖ్యమైన తేదీలు
    వన్డేల్లో 65 హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లీ విరాట్ కోహ్లీ
    విశాఖపట్నం: కుప్పకూలిన భవనం; ముగ్గురు మృతి; పుట్టినరోజు నాడే దుర్ఘటన విశాఖపట్టణం

    నిర్మలా సీతారామన్

    ద్రవ రూపంలో ఉండే బెల్లం, పెన్సిల్ షార్పనర్‌లపై పన్ను తగ్గించిన జిఎస్‌టి కౌన్సిల్ జిఎస్‌టి
    ఆంధ్రప్రదేశ్‌‌కు కేంద్రం షాక్: ప్రత్యేక హోదా డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోబోమని నిర్మల ప్రకటన ఆర్థిక శాఖ మంత్రి
    అదానీ గ్రూప్‌ దర్యాప్తుపై అప్‌డేట్‌ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు అదానీ గ్రూప్
    బడ్జెట్ 2023 దేశాన్ని వృద్ధిలోకి తీసుకువస్తుందంటున్న ఆటోమొబైల్ తయారీ సంస్థలు ఆటో మొబైల్

    ఆర్థిక శాఖ మంత్రి

    తెలంగాణ అప్పులు రూ. 4.33లక్షల కోట్లు; లోక్‌సభ్‌లో కేంద్రం ప్రకటన తెలంగాణ
    తెలంగాణ బడ్జెట్ 2023లో హైలెట్స్: శాఖల వారీగా కేటాయింపులు ఇవే తెలంగాణ బడ్జెట్
    తెలంగాణ బడ్జెట్: ఎన్నికల ఏడాదిలో ఎలా ఉండబోతోంది? తెలంగాణ బడ్జెట్
    Budget 2023: కర్ణాటకకు కలిసొచ్చిన అసెంబ్లీ ఎన్నికలు, బడ్టెట్‌లో భారీగా కేటాయింపులు కర్ణాటక

    బడ్జెట్

    ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2023: వ్యవసాయ రంగానికి రూ.41,436 కోట్ల కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
    మన నికర విలువ ఎందుకు తెలుసుకోవాలి నికర విలువ
    సాంకేతికత సాయంతో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఫిబ్రవరి 27 నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్

    ఆర్థిక సంవత్సరం

    ఇంధన ఎగుమతులపై ఆంక్షలను మార్చి తర్వాత కూడా పొడిగించాలనుకుంటున్న ప్రభుత్వం ప్రభుత్వం
    Education Budget 2023: విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై ఫోకస్, బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు ఇవే బడ్జెట్ 2023
    బడ్జెట్ 2023: పాత పన్ను విధానంలో మినహాయింపులు, 80సీ కింద మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయా? బడ్జెట్ 2023
    బడ్జెట్ 2023లో పన్ను తగ్గింపులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు? బడ్జెట్ 2023

    బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Business Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023