Budget 2023: 'రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం', పార్లమెంట్‌లో రాష్ట్రపతి ముర్ము
కేంద్ర బడ్జెట్-2023 పార్లమెంట్ సమావేశాలు మంగళవారం ప్రారంభయ్యమాయి. అయితే ఉభయ సమభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్‌లో ప్రసంగించారు. ముర్ము రాష్ట్రపతి అయ్యాక పార్లమెంట్‌లో ఇదే ఆమె తొలి ప్రసంగం. ప్రపంచానికి పరిష్కార మార్గాలు చూపుతున్న భారత్‌ను ప్రపంచ దేశాలు భిన్నమైన కోణంలో చూస్తున్నాయన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పేదరిక నిర్మూలన, అన్ని వర్గాల అభివృద్ధి కోసం కేంద్రం కృషి చేస్తున్నట్లు చెప్పారు. అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్న వేళ, రాబోయే 25ఏళ్లు దేశానికి ఎంతో కీలకమన్నారు. బీజేపీ ఆంధ్వర్యంలోని కేంద్రం ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నట్లు రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ వంటి కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు వివరించారు.
ఆదివాసి ప్రాంతాల్లో ఆదర్శ పాఠాశాలలు ఏర్పాటు: రాష్ట్రపతి
పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక నేరగాళ్ల చట్టాన్ని ఆమోదించినట్లు రాష్ట్రపతి ముర్ము వెల్లడించారు. ప్రభుత్వంలో జవాబుదారి తనం పెరిగినట్లు చెప్పారు. బినామీ ఆస్థులను స్వాధీనం చేసుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆదివాసి ప్రాంతాల్లో ఆదర్శ పాఠాశాలలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్రపతి వివరించారు. చరిత్రలో తొలిసారిగా బిర్సా ముందా జయంతిని అధికారికంగా కేంద్రం నిర్వహించినట్లు చెప్పారు. తీవ్రవాద ప్రభావిత జిల్లాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాల్లో సరిహద్దు గ్రామాల్లో రక్షణ చర్యలను మరింత పటిష్టం చేసినట్లు రాష్ట్రపతి ముర్ము స్పష్టం చేశారు. మహిళా సాధికారతను కేంద్రం ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.