Obesity,Diabetes: భారత్'లో బ్లాక్ బస్టర్ యాంటీ-ఒబెసిటి డ్రగ్ విడుదల చేసిన ఎలి లిల్లీ.. ధర ఎంతంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో తొలిసారిగా ఊబకాయం, టైప్-2 మధుమేహం చికిత్సకు ప్రత్యేకమైన ఔషధాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఎలీ లిల్లీ సంస్థ ప్రకటించింది.
మౌంజారో (Mounjaro) అనే బ్రాండ్ పేరుతో ఈ ఔషధాన్ని మార్కెట్లో విడుదల చేసినట్టు వెల్లడించింది.
దీనికి కేంద్ర ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థ (CDSCO) అనుమతి లభించిందని స్పష్టం చేసింది.
మౌంజారో సింగిల్ డోస్ బాటిల్ రూపంలో లభిస్తుంది, ఇందులో 2.5 మి.గ్రా ధర రూ. 3,500, అలాగే 5 మి.గ్రా ధర రూ. 4,375 గా నిర్ణయించబడింది.
వివరాలు
భారత్‌లో తొలిసారి అందుబాటులోకి
మధుమేహం నివారణకు, బరువు తగ్గించే చికిత్సలో మౌంజారో ఉపయోగపడే ఔషధం.
ఇది టిర్జెపటైడ్ (Tirzepatide) అనే ప్రధాన శాస్త్రీయ సంయోగంతో రూపొందించబడింది.
ఇప్పటికే బ్రిటన్, యూరప్ దేశాల్లో ఈ ఔషధం అందుబాటులో ఉండగా, అమెరికాలో జెఫ్‌బౌండ్ (Zepbound) అనే పేరుతో విక్రయిస్తున్నారు.
అయితే, భారత్‌లో మాత్రం ఈ ఔషధం తొలిసారి అందుబాటులోకి వస్తోంది.
మౌంజారో ఔషధం శరీరంలో GIP (గ్లూకోజ్ ఆధారిత ఇన్సులినోట్రోపిక్ పోలిపెప్టైడ్) GLP-1 (గ్లూకాగాన్ మాదిరి పెప్టైడ్) హార్మోన్ గ్రాహకాలను ఉత్తేజపరచడం ద్వారా పనిచేస్తుందని నిపుణులు తెలిపారు.
వివరాలు
దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మందికి మధుమేహం, ఊబకాయం
భారత్‌లో ఊబకాయం, అధిక బరువు, టైప్-2 మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి.
దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది మధుమేహం, ఊబకాయంతో బాధపడుతున్నారని అంచనా.
అధిక బరువు కారణంగా మధుమేహం ముప్పు పెరుగుతుండటంతో పాటు, హైపర్‌టెన్షన్, హృద్రోగ సమస్యలు, నిద్రలేమి వంటి 200కి పైగా ఆరోగ్య సమస్యలు సంభవించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.