LOADING...
Elon Musk: ఒక్కరోజులో మస్క్‌కు వచ్చిన లాభం.. అంబానీ మొత్తం సంపదకు రెండింతలు!
Musk: ఒక్కరోజులో మస్క్‌కు వచ్చిన లాభం.. అంబానీ మొత్తం సంపదకు రెండింతలు!

Elon Musk: ఒక్కరోజులో మస్క్‌కు వచ్చిన లాభం.. అంబానీ మొత్తం సంపదకు రెండింతలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 17, 2026
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి తన సంపదతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. ఆయనకు చెందిన స్పేస్‌-X కంపెనీ షేర్లు పబ్లిక్ ఇష్యూ తర్వాత అనూహ్యంగా పెరగడంతో మస్క్ నికర సంపద భారీగా పెరిగింది. ఒకే ట్రేడింగ్ రోజులో ఆయన సంపదలో నమోదైన పెరుగుదల భారత కుబేరుడు ముకేశ్ అంబానీ మొత్తం సంపద కంటే రెండింతలు ఉండటం విశేషం. స్పేస్‌ఎక్స్ పబ్లిక్ ఇష్యూలో ఒక్కో షేరు ధర 135 డాలర్లుగా నిర్ణయించగా, మార్కెట్లో షేరు విలువ ఇప్పటికే 200 డాలర్ల మార్కును దాటింది. ఒక ట్రేడింగ్ రోజులో కంపెనీ షేర్లు 14.71 శాతం పెరగడంతో ఎలాన్ మస్క్ సంపద ఏకంగా 164.8 బిలియన్ డాలర్లు పెరిగినట్లు ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి.

వివరాలు 

మస్క్ సంపద పెరిగిన రోజే ముకేశ్ అంబానీకి చెందిన షేర్ల విలువ కూడా పెరిగింది

ఈ ఒక్కరోజు పెరుగుదలే ముకేశ్ అంబానీ మొత్తం నికర సంపద 89.7 బిలియన్ డాలర్ల కంటే దాదాపు రెండింతలు కావడం గమనార్హం. ప్రస్తుతం ఎలాన్ మస్క్ నికర ఆస్తుల విలువ సుమారు 1.3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. టెస్లా, స్పేస్‌ఎక్స్ కంపెనీల్లో ఆయనకున్న వాటాలే ఈ సంపదకు ప్రధాన ఆధారంగా ఉన్నాయి. మరోవైపు, మస్క్ సంపద పెరిగిన రోజే ముకేశ్ అంబానీకి చెందిన షేర్ల విలువ కూడా పెరిగింది. దీంతో ఆయన నికర సంపద 965 మిలియన్ డాలర్లు లేదా 1.09 శాతం వృద్ధి చెందింది. సాధారణంగా ఇది భారీ పెరుగుదలే అయినప్పటికీ, మస్క్ ఒక్క రోజులో ఆర్జించిన సంపదతో పోలిస్తే చాలా తక్కువగా కనిపిస్తోంది.

వివరాలు 

నాస్‌డాక్‌లో స్పేస్‌ఎక్స్ షేరు 150 డాలర్ల వద్ద లిస్ట్

ఎలాన్ మస్క్ సంపదపై నెటిజన్లు ఆసక్తికర పోలికలు కూడా చెబుతున్నారు. భారతదేశ జీడీపీ సుమారు 4.15 ట్రిలియన్ డాలర్లు కాగా, మస్క్ వ్యక్తిగత సంపద దానిలో దాదాపు నాలుగో వంతుకు సమానంగా ఉండటం చర్చకు దారితీస్తోంది. శుక్రవారం నాస్‌డాక్‌లో స్పేస్‌ఎక్స్ షేరు 150 డాలర్ల వద్ద లిస్ట్ అయింది. ఇది పబ్లిక్ ఇష్యూ ధర 135 డాలర్లతో పోలిస్తే సుమారు 11 శాతం అధికం. ఈ కంపెనీలో ఎలాన్ మస్క్‌కు సుమారు 480 కోట్ల షేర్లు ఉన్నాయి. షేరు ధరలు పెరుగుతున్న కొద్దీ ఆయన సంపద కూడా వేగంగా పెరుగుతూ ట్రిలియన్ డాలర్ల మార్కును దాటింది.

Advertisement

వివరాలు 

2140 వరకు ఖర్చు పెట్టినా..

ఎలాన్ మస్క్ సంపద పెరుగుదల ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఒక ట్రిలియన్ డాలర్లు అంటే ఒక మిలియన్ మిలియన్ డాలర్లకు సమానం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లెక్కల ప్రకారం.. ప్రతి గంటకు ఒక మిలియన్ డాలర్లు ఖర్చు చేసినా, ఆయన సంపద 2140 సంవత్సరం వరకు పూర్తిగా ఖర్చు కాదని, అప్పటికీ ఇంకా మిగిలే అవకాశం ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Advertisement