Elon Musk: భారీగా పతనమైన ఎలాన్ మస్క్, ఎక్స్ విలువ.. $24బిలియన్ల నష్టం
సామాజిక మాధ్యమం ఎక్స్ విలువ భారీగా క్షీణించినట్లు వాషింగ్టన్ పోస్టు నివేదికలో వెల్లడైంది. ఎలాన్ మస్క్, ఆయన ఇన్వెస్టర్ల గ్రూప్ ప్రస్తుతం 24 బిలియన్ డాలర్ల వరకు నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. 2022 అక్టోబర్‌తో పోలిస్తే ఈ విలువ దాదాపు 72 శాతం తగ్గింది. ఎక్స్ కొనుగోలులో ముఖ్య పాత్ర పోషించిన ఎనిమిది ప్రధాన పెట్టుబడిదారులు, మస్క్ అధిపతిగా మారిన తర్వాత 5 బిలియన్ డాలర్ల నష్టాన్ని ఎదుర్కొన్నారు. వీటిలో జాక్‌డోర్సె, లారీ ఎల్సిసన్, సైకియాక్యాపిటల్స్ పెట్టుబడులు కూడా ఉన్నాయి.
మస్క్ తరువాత అతిపెద్ద పెట్టుబడిదారుగా కింగ్ అల్వీద్ బిన్ తలాల్
ఎక్స్‌లో మస్క్ తరువాత అతిపెద్ద పెట్టుబడిదారుగా కింగ్ అల్వీద్ బిన్ తలాల్ నిలిచారు, ఆయన వాటాల విలువ 1.9 బిలియన్ డాలర్లు. భవిష్యత్తులో ఎక్స్ నుంచి ఆదాయ వనరులు పెరగడానికి విశ్వసిస్తున్నట్లు వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. ఎక్స్ తీవ్ర నష్టాలబాట పట్టడానికి వాణిజ్య ప్రకటనలదారులు దూరమవడమే అని భావిస్తున్నారు. వాక్ స్వేచ్ఛపై తేలిగ్గా వ్యవహరించడం వల్ల ఎక్స్‌కు పలు నియంత్రణ సంస్థల నుంచి సమస్యలు ఏర్పడ్డాయి. ఈ కారణంగా బ్రెజిల్‌లో ఈ వేదికపై నిషేధం వేటు పడింది.