Elon Musk: రోజుకు రూ.8,300 కోట్లు.. ఏడాదిలో మస్క్ సంపద రూ.30 లక్షల కోట్లు పెరిగింది
ఈ వార్తాకథనం ఏంటి
2026 జూన్ 12న స్పేస్-X స్టాక్‌మార్కెట్‌లోకి ప్రవేశించిన సమయంలో ఎలాన్ మస్క్ సంపద మరో కీలక మైలురాయిని చేరింది. దీంతో ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఆయన అవతరించారు. అంటే లక్ష కోట్ల డాలర్లు లేదా సుమారు రూ.95 లక్షల కోట్లకు పైగా సంపద కలిగిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అయితే ఆ తర్వాత స్పేస్-X షేర్లు భారీగా పతనం కావడంతో గత నెలలో మస్క్ ట్రిలియనీర్ హోదాను కోల్పోయారు. అయినప్పటికీ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఆయన కొనసాగుతున్నారు.
వివరాలు
ఏఐతో టెక్ కుబేరులకు భారీ లాభాలు..
గత ఏడాది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), టెక్నాలజీ రంగాలు వేగంగా విస్తరించాయి.
ఈ వృద్ధి టెక్ కంపెనీలతో పాటు వాటి వ్యవస్థాపకులు,సీఈఓల సంపదపైనా గణనీయమైన ప్రభావం చూపింది.
ఎలాన్ మస్క్‌తో పాటు మైఖేల్ డెల్,లారీ పేజ్,సెర్గీ బ్రిన్, గియాన్‌కార్లో వంటి టెక్ పారిశ్రామికవేత్తల సంపద కూడా భారీగా పెరిగింది.
మస్క్ తర్వాత వేగంగా సంపద పెంచుకున్న టెక్ పారిశ్రామికవేత్తల్లో డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, సీఈఓ మైఖేల్ డెల్ ముందున్నారు.
వివరాలు
ఏఐతో టెక్ కుబేరులకు భారీ లాభాలు..
2025 జులై నుంచి 2026 జులై మధ్య ఆయన సంపద 107.6 బిలియన్ డాలర్లు పెరిగింది.
ఇక ఏఐ రంగంలో వచ్చిన భారీ వృద్ధి డీప్‌సీక్ వ్యవస్థాపకుడు లియాంగ్ వెన్‌ఫెంగ్ సంపదను కూడా గణనీయంగా పెంచింది.
ఈ ఏడాది కాలంలో ఆయన సంపద 39.5 బిలియన్ డాలర్లు పెరిగింది.
దీంతో ప్రపంచంలోని టాప్ 50 అత్యంత ధనవంతుల జాబితాలో లియాంగ్ వెన్‌ఫెంగ్ చోటు దక్కించుకున్నారు.