LOADING...
Hospitalisation leave: ఉద్యోగుల లీవ్‌లపై కొత్త నిబంధనలు.. రెడిట్‌లో వైరల్ అయిన కంపెనీ పాలసీ
రెడిట్‌లో వైరల్ అయిన కంపెనీ పాలసీ

Hospitalisation leave: ఉద్యోగుల లీవ్‌లపై కొత్త నిబంధనలు.. రెడిట్‌లో వైరల్ అయిన కంపెనీ పాలసీ

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 17, 2025
02:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒక సంస్థలో సిక్ లీవ్‌, క్యాజువల్ లీవ్‌లు పూర్తిగా రద్దు చేసి, హాస్పిటల్‌లో చేరితే మాత్రమే మెడికల్ లీవ్ ఇస్తున్నారంటూ ఓ ఉద్యోగి ఆరోపణలు చేయడంతో ఆ కంపెనీపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశం ప్రస్తుతం ఆన్‌లైన్‌లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఆరోపణలను ఆ ఉద్యోగి రెడిట్‌ (Reddit) వేదికగా బయటపెట్టాడు. సంస్థలోని మేనేజ్‌మెంట్‌ తీసుకున్న నిర్ణయానికి సంబంధించినదిగా చెప్పబడుతున్న ఒక అంతర్గత మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను కూడా అతడు షేర్ చేశాడు. ఆ మెసేజ్‌ను సంస్థ మానవ వనరుల (HR) విభాగం నుంచి స్లాక్‌ (Slack) ద్వారా ఉద్యోగులందరికీ పంపినట్టుగా పేర్కొన్నారు. ఆ సందేశానికి "Important Leave Policy Update" అనే శీర్షిక ఉంది.

వివరాలు 

అత్యవసర పరిస్థితుల్లో Hospitalisation Leave

ఆ స్క్రీన్‌షాట్‌లో ఉన్న వివరాల ప్రకారం,కంపెనీ తమ లీవ్ పాలసీని మార్చినట్లు ఉద్యోగులకు తెలియజేసింది. "ప్రస్తుత వర్క్ కల్చర్‌కు అనుగుణంగా లీవ్ పాలసీలో కొన్నికీలక మార్పులు చేశాం.ఇకపై క్యాజువల్ లీవ్‌,సిక్ లీవ్‌ ఉండవు"అని ఆ మెసేజ్‌లో పేర్కొన్నట్లు ఉద్యోగి తెలిపాడు. అయితే ఇకపై అమల్లో ఉండే లీవ్‌ల వివరాలను కూడా ఆ సందేశంలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. Annual Paid Leave పేరుతో ఏడాదికి మొత్తం 12రోజులు ఇస్తామని,ప్రతినెలా ఒక రోజు చొప్పున క్రెడిట్ అవుతాయని తెలిపినట్టు ఉంది. ఈ లీవ్‌లను వ్యక్తిగత అవసరాలు,సెలవులు,ఇతర పనుల కోసం వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. ఇక Hospitalisation Leave మాత్రం అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చినప్పుడు మాత్రమే వర్తిస్తుందని ఆ మెసేజ్‌లో ఉందని ఉద్యోగి వెల్లడించాడు.

వివరాలు 

మెడికల్ లీవ్‌కు సంబంధించిన నిబంధనలు 

మెడికల్ లీవ్‌కు సంబంధించిన నిబంధనల్ని కూడా అందులో స్పష్టం చేశారు. ఈ లీవ్‌ను రెండు దశల్లో ఇస్తామని, జనవరిలో 3 రోజులు, జూలైలో మరో 3 రోజులు క్రెడిట్ అవుతాయని పేర్కొన్నారు. అయితే హాస్పిటల్ అడ్మిషన్, డిశ్చార్జ్ పేపర్లు లేదా ధృవీకరించిన మెడికల్ రిపోర్ట్ ఉంటేనే ఈ లీవ్‌కు అనుమతి ఉంటుందని ఆ మెసేజ్‌లో ఉన్నట్టు తెలిపారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో రెడిట్‌లో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. కొందరు ఈ నిర్ణయంపై వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. "చనిపోయే ముందు చివరి రోజున అప్లై చేసుకునేలా 'డెత్‌బెడ్ లీవ్' కూడా పెట్టాల్సింది" అని ఒకరు వ్యాఖ్యానించారు.

Advertisement

వివరాలు 

కార్మిక చట్టాల ఉల్లంఘనపై ప్రశ్నలు

మరికొందరు కార్మిక చట్టాల ఉల్లంఘనపై ప్రశ్నలు లేవనెత్తారు. "షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం క్యాజువల్, సిక్ లీవ్‌లు ఉద్యోగుల హక్కు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం" అని ఒక యూజర్ అభిప్రాయపడ్డాడు. మరికొందరు ఆరోగ్యపరమైన సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. "జలుబు వచ్చినా ఆఫీసుకే రావాలా? ఇక జాబ్ మారాల్సిందే" అని ఓ యూజర్ రాశాడు. ఇంకొందరు ఈ కంపెనీ నిర్ణయాన్ని పూర్తిగా ఖండించారు.

Advertisement

వివరాలు 

ఫ్లూ ఉన్న వ్యక్తి ఆఫీసుకి వస్తే మొత్తం ఆఫీస్‌కు వ్యాపిస్తుంది

మరో యూజర్ అయితే, "సిక్ లీవ్ ఉద్యోగులకే కాదు, కంపెనీలకూ అవసరం. ఫ్లూ ఉన్న వ్యక్తి ఆఫీసుకి వస్తే మొత్తం ఆఫీస్‌కు వ్యాపిస్తుంది" అంటూ వ్యాఖ్యానించాడు. ఈ అంశంపై ఇప్పటివరకు ఆ కంపెనీ అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అలాగే రెడిట్‌లో షేర్ చేసిన ఆ అంతర్గత మెసేజ్ నిజమా కాదా అన్నదాన్ని Moneycontrol.com స్వతంత్రంగా నిర్ధారించలేదని కూడా పేర్కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రెడిట్‌లో వైరల్ అయిన కంపెనీ పాలసీ

Advertisement