LOADING...
Coforge: కోఫోర్జ్‌ చేతికి ఎంకోరా.. ఏఐ రంగంలో భారీ డీల్
కోఫోర్జ్‌ చేతికి ఎంకోరా.. ఏఐ రంగంలో భారీ డీల్

Coforge: కోఫోర్జ్‌ చేతికి ఎంకోరా.. ఏఐ రంగంలో భారీ డీల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 27, 2025
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాకు చెందిన ఏఐ (కృత్రిమ మేధ) సంస్థ 'ఎంకోరా'లో 100 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు ఐటీ సేవల సంస్థ కోఫోర్జ్ ప్రకటించింది. ఈ డీల్‌ మొత్తం 2.35 బిలియన్‌ డాలర్ల ఎంటర్‌ప్రైజ్‌ విలువకు (భారత కరెన్సీలో సుమారు రూ.21,333 కోట్లు జరగనుంది. ఈ కొనుగోలు మొత్తం షేర్ల లావాదేవీ (ఆల్‌-షేర్‌ ట్రాన్సాక్షన్‌) రూపంలో నిర్వహించనున్నట్లు కోఫోర్జ్‌ స్పష్టం చేసింది. ఈ ఒప్పందం ప్రకారం, ఎంకోరాలోని ప్రస్తుత వాటాదార్లకు కోఫోర్జ్‌ 1.89 బిలియన్‌ డాలర్ల విలువైన ప్రిఫరెన్షియల్‌ షేర్లను జారీ చేయనుంది.

Details

20శాతం వాటా లభించే అవకాశం

లావాదేవీ పూర్తయిన తర్వాత, విక్రేతలకు కోఫోర్జ్‌లో సుమారు 20 శాతం వాటా లభించనుంది. అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌, వార్‌బర్గ్‌ పింకస్‌తో పాటు ఇతర మైనారిటీ వాటాదార్ల నుంచి ఎంకోరాలోని 100 శాతం షేర్లను కొనుగోలు చేయడానికి ఒప్పందంపై సంతకాలు చేసినట్లు కోఫోర్జ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన సమాచారంలో వెల్లడించింది.

Advertisement