LOADING...
EPFO: ఈపీఎఫ్‌ ఉపసంహరణలు సులభం.. డబ్బు ఎప్పుడు తీసుకోవచ్చో తెలుసా?
ఈపీఎఫ్‌ ఉపసంహరణలు సులభం.. డబ్బు ఎప్పుడు తీసుకోవచ్చో తెలుసా?

EPFO: ఈపీఎఫ్‌ ఉపసంహరణలు సులభం.. డబ్బు ఎప్పుడు తీసుకోవచ్చో తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 06, 2026
04:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఈపీఎఫ్‌ ఉపసంహరణ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఇప్పటివరకు 13 రకాలుగా ఉన్న ఉపసంహరణ కారణాలను మూడు ప్రధాన విభాగాలుగా కుదించింది. అత్యవసర అవసరాలు, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులుగా విభజించింది. ఈ మార్పుల ఉద్దేశం స్పష్టతను పెంచడమే అయినప్పటికీ అతి సులభంగా డబ్బులు తీసుకోవడం దీర్ఘకాల ప్రయోజనాలకు నష్టం కలిగించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈపీఎఫ్‌ అనేది మౌలికంగా రిటైర్మెంట్‌ కోసం రూపొందించిన పొదుపు పథకం. ఉద్యోగ జీవితం పూర్తయ్యే వరకు నిధులు ఖాతాలోనే ఉండి, సంకలిత వడ్డీ (compounding)ద్వారా పెద్ద మొత్తంగా మారాలన్నదే దీని ప్రధాన లక్ష్యం. అవసరాల కోసం ఉపసంహరణకు అవకాశం ఉన్నప్పటికీ, అవి ఖచ్చితంగా నిర్వచించిన పరిస్థితులకే పరిమితం.

Details

పూర్తి ఈపీఎఫ్‌ ఉపసంహరణ ఎప్పుడు సాధ్యం? 

కింది పరిస్థితుల్లో పూర్తి ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌ను ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. 58 ఏళ్లు నిండిన తర్వాత రిటైర్మెంట్‌ సమయంలో స్వచ్ఛంద పదవీ విరమణ (Voluntary Retirement) తీసుకున్నప్పుడు శాశ్వత వైకల్యం (Permanent Disability) ఏర్పడినప్పుడు విదేశాలకు శాశ్వతంగా వలస వెళ్లినప్పుడు (Permanent Migration) ఈ సందర్భాల్లో ఈపీఎఫ్‌ ఖాతా తన సహజ గమ్యాన్ని చేరుకున్నదిగా పరిగణించి, పూర్తి ఉపసంహరణకు అనుమతి ఇస్తారు.

Details

ముందస్తు ఉపసంహరణపై పన్ను భారం

అయితే ఉద్యోగం ప్రారంభించిన ఐదేళ్ల లోపు ఈపీఎఫ్‌ నుంచి డబ్బులు తీసుకుంటే పన్ను భారం పడే అవకాశం ఉంది. అంతేకాదు దీర్ఘకాలంలో లభించే సంకలిత వడ్డీ ప్రయోజనం కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే అత్యవసర పరిస్థితులు తప్ప ముందస్తు ఉపసంహరణపై పునరాలోచన అవసరమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. సులభతరం ప్రమాదమా? ఈపీఎఫ్‌వో తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో ఉపసంహరణ ప్రక్రియ సులభమైంది. కానీ అదే సమయంలో అవసరం లేకుండా డబ్బులు తీసుకునే ప్రలోభం పెరిగే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం. రిటైర్మెంట్‌ భద్రతను దృష్టిలో ఉంచుకుని సమయం, పన్ను ప్రభావం, దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవడం అత్యంత కీలకం

Advertisement