LOADING...
EPF: త్వరలో UPI ద్వారా EPF విత్‌డ్రా.. కేవలం 3 స్టెప్స్‌లోనే బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు!
కేవలం 3 స్టెప్స్‌లోనే బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు!

EPF: త్వరలో UPI ద్వారా EPF విత్‌డ్రా.. కేవలం 3 స్టెప్స్‌లోనే బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు!

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2026
05:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) సభ్యులకు త్వరలో పెద్ద ఊరట లభించనుంది. ఇకపై EPF డబ్బులను UPI ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈ సేవకు సంబంధించిన టెస్టింగ్ పూర్తైందని, ప్రస్తుతం సేవల నాణ్యతను మెరుగుపరచేందుకు EPFO పలు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత చందాదారులు తమ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసుకోవడానికి, అందుబాటులో ఉండే ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌ను చూడగలుగుతారు. ఆ తర్వాత తమ బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన UPI PIN ఉపయోగించి ట్రాన్సాక్షన్‌ను పూర్తి చేయాలి.

వివరాలు 

సాఫ్ట్‌వేర్ లోపాలను సరిచేస్తున్న EPFO

దీంతో డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. ఖాతాలోకి వచ్చిన తర్వాత ఆ మొత్తాన్ని డిజిటల్ పేమెంట్స్‌కు వినియోగించుకోవచ్చు. అలాగే ATM ద్వారా నగదుగా కూడా డ్రా చేసుకోవచ్చు. EPFO ప్రస్తుతం ఈ విధానం సజావుగా అమలు కావడానికి సాఫ్ట్‌వేర్ లోపాలను సరిచేస్తోంది. ఈ కొత్త సదుపాయం ద్వారా దేశవ్యాప్తంగా 7 కోట్లకు పైగా సభ్యులకు ప్రయోజనం కలగనుంది. మరోవైపు EPF మొత్తంలో కొంత భాగాన్ని ఫ్రీజ్ చేసి, మిగతా మొత్తాన్ని UPI ద్వారా సులభంగా విత్‌డ్రా చేసుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రస్తుతం EPFO సభ్యులు తమ PF డబ్బులు పొందాలంటే విత్‌డ్రా క్లెయిమ్ దాఖలు చేయాల్సి వస్తోంది.

వివరాలు 

 వాట్సప్‌లోనూ లావాదేవీల పరిశీలనకు వీలు

అయితే ఆటో సెటిల్‌మెంట్ విధానంలో దరఖాస్తు చేసిన మూడు రోజుల్లోనే క్లెయిమ్ ప్రాసెస్ పూర్తవుతోంది. ఈ పరిమితిని ఇప్పటికే రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచారు. దీంతో అనారోగ్యం, విద్య, వివాహం, గృహ అవసరాల కోసం సభ్యులు త్వరగా PF డబ్బులు పొందగలుగుతున్నారు. అలాగే సభ్యులతో మరింత వేగంగా కమ్యూనికేషన్ కోసం EPFO వాట్సాప్ సేవలను కూడా ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. సభ్యులు EPFO అధికారిక వాట్సాప్ నంబర్‌కు 'Hello' అని మెసేజ్ పంపితే సేవలు పొందే అవకాశం ఉంటుంది. భద్రత కోసం ఆ నంబర్‌కు గ్రీన్ టిక్ వెరిఫికేషన్ కూడా ఉండనుంది. అదనంగా EPFOలో నమోదైన మొబైల్ నంబర్‌కు నేరుగా మెసేజ్‌లు అందుకునే సదుపాయాన్ని కూడా కల్పించనున్నారు.

Advertisement