EPFO 3.0 update: UAN ఉన్నవారికి శుభవార్త.. త్వరలో ATM ద్వారా PF డబ్బులు
ఈ వార్తాకథనం ఏంటి
ఈపీఎఫ్ఓ సభ్యులకు గుడ్‌న్యూస్. ఇకపై PF డబ్బులను ATM, UPI ద్వారా సులభంగా విత్‌డ్రా చేసుకునే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుంది. మే నెలాఖరుకల్లా ఈ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ గత ఏడాది ప్రారంభించిన ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా డిజిటల్ సేవలను మరింత సులభతరం చేస్తోంది. 2026 మధ్య నాటికి ఈ వ్యవస్థ పూర్తిగా అమల్లోకి రానుంది. కొత్త విధానంలో PF క్లెయిమ్‌లు వేగంగా సెటిల్ కావడం, డబ్బులు నేరుగా ఉద్యోగి బ్యాంక్ ఖాతాలోకి బదిలీ కావడం వంటి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా ATM, UPI ద్వారా PF విత్‌డ్రా చేసే ఫీచర్‌పై ఉద్యోగుల్లో ఆసక్తి నెలకొంది.
వివరాలు
PF బ్యాలెన్స్‌లో గరిష్టంగా 50 శాతం వరకు విత్‌డ్రాకి అవకాశం
దీని వల్ల కార్యాలయాల చుట్టూ తిరగకుండా, పేపర్‌వర్క్ లేకుండా సులభంగా డబ్బులు తీసుకునే వీలు ఉంటుంది. అయితే UPI లేదా ATM ద్వారా మొత్తం PF బ్యాలెన్స్‌లో గరిష్టంగా 50 శాతం వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇందుకోసం EPFO ప్రత్యేక ATM కార్డులను కూడా జారీ చేయాలని యోచిస్తోంది. ఈ కార్డులు నేరుగా సభ్యుల PF ఖాతాలకు లింక్ అవుతాయి. ATM, UPI ద్వారా PF డబ్బులు తీసుకోవాలంటే సభ్యులకు యాక్టివ్ UAN తప్పనిసరి. అలాగే ఆధార్, PAN, బ్యాంక్ ఖాతా నంబర్, IFSC వంటి KYC వివరాలు పూర్తి చేసి ఉండాలి.
వివరాలు
2025-26 ఆర్థిక సంవత్సరంలో 8.31 కోట్ల క్లెయిమ్‌లు
ఇక PF క్లెయిమ్‌ల విషయంలో కూడా EPFO రికార్డు స్థాయిలో సేవలు అందిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 8.31 కోట్ల క్లెయిమ్‌లు పరిష్కరించినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఇందులో అడ్వాన్స్, పాక్షిక విత్‌డ్రా క్లెయిమ్‌లు 5.51 కోట్లుగా నమోదయ్యాయి. వీటిలో 71 శాతం పైగా క్లెయిమ్‌లు మూడు రోజుల్లోనే స్వయంచాలక విధానంలో పూర్తైనట్లు తెలిపారు.