LOADING...
EPFO: ఉద్యోగులకు శుభవార్త.. డబ్బు విత్‌డ్రా ప్రక్రియలో కీలక అప్‌డేట్
ఉద్యోగులకు శుభవార్త.. డబ్బు విత్‌డ్రా ప్రక్రియలో కీలక అప్‌డేట్

EPFO: ఉద్యోగులకు శుభవార్త.. డబ్బు విత్‌డ్రా ప్రక్రియలో కీలక అప్‌డేట్

వ్రాసిన వారు Moogati Shabari
Mar 17, 2026
05:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

లోక్‌సభలో ప్రభుత్వం EPFO 3.0 గురించి కీలక విషయాలు తెలిపింది. కొత్త వ్యవస్థ ద్వారా క్లెయిమ్ సెటిల్‌మెంట్ వేగవంతం చేయడం, పింఛన్ చెల్లింపు వ్యవస్థలను మెరుగుపరచడం, మొత్తం ప్రాసెస్ సులభంగా చేసే విధానాన్ని అమలు చేయాలని తెలిపింది. కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ప్రకారం.. EPFO 3.0 డిజిటలైజ్ చేయడం వల్ల ఆ పని మరింత సులభం కానుంది. తక్కువ సమయంలోనే డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.

వివరాలు

కేంద్ర పింఛను చెల్లింపు వ్యవస్థ (CPPS):

ప్రభుత్వం ప్రకారం.. CPPS ను పూర్తిగా అమలు చేశారు. 2025 జనవరి 1 నుండి అన్ని EPFO కార్యాలయాలు ఈ వ్యవస్థ ద్వారా పనిచేస్తున్నాయి. ఫలితంగా, ప్రతి నెలా 70 లక్షల కంటే ఎక్కువ పింఛనుదారులకు సకాలంలో, పింఛను చెల్లింపులు జరుగుతున్నాయి.

వివరాలు

ఆటోమేటిక్‌గా డబ్బులు బదిలీ

క్లెయిమ్ చేయడానికి కూడా కేంద్రం కీలక మార్పు చేసింది. 2026 ఫిబ్రవరి 25 నాటికి, రూ.5 లక్షల వరకు ఉన్న 3,52,00,000 కంటే ఎక్కువ క్లెయిమ్‌లు ఆటోమేటిక్ మోడ్‌లో పరిష్కరించబడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం అడ్వాన్స్ క్లెయిమ్‌లలో 71.37% మాన్యువల్ ప్రాసెసింగ్ లేకుండా పూర్తి అయ్యాయి. దీని ద్వారా సుమారు రూ.51,620 కోట్లు చెల్లింపులు అయ్యాయి. ఉద్యోగులు వేరే సంస్థలోకి ఉద్యోగాలు మార్చినపుడు EPF ఖాతాల బదిలీ చాలా సులభం అవుతుంది. 2026 ఫిబ్రవరి 25 నాటికి, ఉద్యోగి లేదా యజమాని ప్రమేయం లేకుండా 70.54 లక్షలకంటే ఎక్కువ బదిలీ క్లెయిమ్‌లు అయ్యాయి. KYC ఒకసారి పూర్తయిన తర్వాత పాత లేదా కొత్త యజమాని ఆమోదం అవసరం లేదు.

Advertisement

వివరాలు

కేవలం 3 రోజుల్లో క్లెయిమ్ ప్రాసెసింగ్

ఈ ప్రాసెస్ ద్వారా అదనంగా, 21.39 లక్షలకంటే ఎక్కువ ఉద్యోగులు యజమాని సహాయం లేకుండా బదిలీ క్లెయిమ్‌లను సమర్పించారు. EPFO 3.0 ప్రధానంగా ప్రక్రియలను సులభతరం చేయడం, పేపర్ వర్క్ పనిని తగ్గించడం కోసం ఇది రూపొందించబడింది. చాలా సేవలు ఇప్పుడు ఒకే ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా గతంలో క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయడానికి 20 రోజుల వరకు పట్టేది. ఇప్పుడు అది కేవలం 3 రోజుల్లోనే పూర్తవుతుంది.

Advertisement