NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / EPF Interest Rate:ఈపీఎఫ్‌ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటు 
    తదుపరి వార్తా కథనం
    EPF Interest Rate:ఈపీఎఫ్‌ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటు 
    ఈపీఎఫ్‌ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటు

    EPF Interest Rate:ఈపీఎఫ్‌ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 28, 2025
    12:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఖాతాలలో నిల్వలపై వడ్డీ రేటును నిర్ణయించారు.

    2024-25 ఆర్థిక సంవత్సరానికి కూడా 8.25 శాతం వడ్డీరేటును (Interest Rate) కొనసాగించాలని నిర్ణయించారు.

    ఈ విషయాన్ని శుక్రవారం నిర్వహించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో ఆమోదించారని ఈపీఎఫ్‌వో (EPFO) వర్గాలు వెల్లడించాయి.

    2023-24 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే వడ్డీ రేటును అమలు చేసిన సంగతి తెలిసిందే.

    సీబీటీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపనున్నారు.

    ప్రభుత్వ అనుమతి లభించిన తర్వాత,ఈపీఎఫ్‌ఓ వడ్డీ రేటును అధికారికంగా ప్రకటిస్తుంది.

    ఆ తర్వాత, 7కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో వడ్డీ మొత్తాన్ని జమ చేయనుంది.

    సీబీటీ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక శాఖ త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

    వివరాలు 

    గత పదేళ్లలో ఈపీఎఫ్‌ (EPF) వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.. 

    ఇదివరకు, 2022 మార్చిలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్‌ వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించారు.

    1977-78 తర్వాత ఇంత తక్కువ స్థాయికి చేరుకోవడం విశేషం.

    అనంతరం రెండు సంవత్సరాల పాటు స్వల్పంగా పెంచిన ఈపీఎఫ్‌ఓ, తాజాగా 8.25 శాతంగా నిలిపినట్లు గమనించవచ్చు.

    2014-15 : 8.75 శాతం

    2015-16 : 8.8 శాతం

    2016-17 : 8.65 శాతం

    2017-18 : 8.55 శాతం

    2018-19 : 8.65 శాతం

    2019-20 : 8.5 శాతం

    2020-21 : 8.5 శాతం

    2021-22 : 8.1 శాతం

    2022-23 : 8.15 శాతం

    2023-24 : 8.25 శాతం

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఈపీఎఫ్ఓ

    తాజా

    Shubhanshu Shuklas: మరోసారి వాయిదా పడిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షయాత్ర.. మళ్ళీ ఎప్పుడంటే..? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం
    Botsa Satyanarayana: వేదికపై సొమ్మసిల్లిన బొత్స సత్యనారాయణ.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు బొత్స సత్యనారాయణ
    Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో.. నివిడియా
    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు

    ఈపీఎఫ్ఓ

    పీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. ఈ-నామినేషన్ లేకుంటే రూ.7 లక్షలు గల్లంతే పెన్షన్
    ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లు ఖరారు.. 8.15 శాతం ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ బిజినెస్
    EPFO: ఈపీఎఫ్ఓలో భారీగా పెరిగిన సభ్యులు; జూన్‌లో 17.89 లక్షల మంది చేరిక  ఉద్యోగులు
    ETFలో తిరిగి ఇన్వెస్ట్ చేసేందుకు EPFO ఆసక్తి..ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025