Page Loader
EPFO: ఉద్యోగులకు శుభవార్త.. ​​వడ్డీ రేటును 8.25 శాతానికి పెంచిన ఈపీఎఫ్ఓ 
EPFO: ఉద్యోగులకు శుభవార్త.. ​​వడ్డీ రేటును 8.25 శాతానికి పెంచిన ఈపీఎఫ్ఓ

EPFO: ఉద్యోగులకు శుభవార్త.. ​​వడ్డీ రేటును 8.25 శాతానికి పెంచిన ఈపీఎఫ్ఓ 

వ్రాసిన వారు Stalin
Feb 10, 2024
01:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోట్లాది మంది ఉద్యోగులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) శుభవార్త చెప్పింది ఈపీఎఫ్‌ఓ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) శనివారం జరిగిన సమావేశంలో 2023-24 సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF)పై 8.25 శాతానికి పెంచాలని నిర్ణయించింది. గతేడాది కంటే.. ఇప్పుడు 0.10 శాతం వడ్డీ రేటును పెంచింది. దీంతో 2023-24 ఏడాదిలో పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తానికి 8.25శాతను వడ్డీ రేటు వర్తిస్తుంది. 2021-22లో వడ్డీ రేటు 8.10శాతం ఉండగా.. 2022-23లో దాన్ని 8.15 శాతానికి పెంచింది. ఈ ఏడాది అదనంగా మరో 0.10శాతాన్ని జోడించింది. ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల పీఎఫ్ ఖాతాపై ఈపీఎఫ్‌ఓ ప్రతి సంవత్సరం వడ్డీ రేటును సవరిస్తుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

0.10శాతం పెరిగిన వడ్డీ రేటు