Loading...
EPS Pension 2026: ఈపీఎస్ పెన్షన్ ఎంత వస్తుందో చివరి ఐదేళ్ల జీతం ఎలా నిర్ణయిస్తుందో తెలుసా?
ఈపీఎస్ పెన్షన్ ఎంత వస్తుందో చివరి ఐదేళ్ల జీతం ఎలా నిర్ణయిస్తుందో తెలుసా?

EPS Pension 2026: ఈపీఎస్ పెన్షన్ ఎంత వస్తుందో చివరి ఐదేళ్ల జీతం ఎలా నిర్ణయిస్తుందో తెలుసా?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2026
02:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉద్యోగం పూర్తయ్యాక ప్రతి నెలా అందే పెన్షన్ వృద్ధాప్యంలో ఆర్థికంగా ఎంతో భరోసానిస్తుంది. ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్)లో నెలవారీ పెన్షన్ మొత్తాన్ని నిర్ణయించడానికి ఉద్యోగి మొత్తం కెరీర్‌లో పొందిన జీతాన్ని పరిగణనలోకి తీసుకోరు. ముఖ్యంగా పదవీ విరమణకు ముందు చివరి ఐదేళ్లలో అందుకున్న వేతనానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఆఖరి 60 నెలల సగటు వేతనమే ప్రాతిపదిక ఈపీఎస్ నిబంధనల ప్రకారం పెన్షన్‌ను లెక్కించేటప్పుడు ఉద్యోగి మొత్తం సర్వీస్ కాలంలో పొందిన వేతనాల సగటును తీసుకోరు. రిటైర్మెంట్‌కు ముందు ఉన్న చివరి 60 నెలలు అంటే ఐదేళ్లలో పొందిన సగటు వేతనాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు. దీంతో ఉద్యోగ జీవితంలోని చివరి దశలో లభించే ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లకు ప్రాధాన్యం పెరుగుతుంది.

వివరాలు 

ఈపీఎస్ పెన్షన్‌ను ఎలా లెక్కిస్తారు?

ఈ కాలంలో వేతనం పెరిగితే, పెన్షనబుల్ వేతనం కూడా పెరిగే అవకాశం ఉండటంతో నెలవారీ పెన్షన్‌పై దాని ప్రభావం పడుతుంది.

నెలవారీ పెన్షన్‌ను నిర్ణయించేందుకు ఈపీఎఫ్ఓ నిర్దిష్ట సూత్రాన్ని అనుసరిస్తుంది.

నెలవారీ పెన్షన్ = (పెన్షనబుల్ వేతనం × పెన్షనబుల్ సర్వీస్) ÷ 70

ఈ సూత్రంలో పెన్షనబుల్ వేతనం, ఉద్యోగి పెన్షనబుల్ సర్వీస్ రెండూ కీలక పాత్ర పోషిస్తాయి. దీనిని కొన్ని ఉదాహరణలతో సులభంగా అర్థం చేసుకోవచ్చు.

30 ఏళ్ల సర్వీస్ ఉంటే ఎంత పెన్షన్?

ఒక ఉద్యోగి పెన్షనబుల్ వేతనం రూ.15,000గా ఉండి, 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేశాడని అనుకుందాం. సూత్రం ప్రకారం లెక్కిస్తే నెలవారీ పెన్షన్ సుమారు రూ.6,429 అవుతుంది.

వివరాలు 

అదే 15 ఏళ్ల సర్వీస్ అయితే..

పెన్షనబుల్ వేతనం రూ.15,000గానే ఉన్నప్పటికీ సర్వీస్ కాలం 15 సంవత్సరాలు మాత్రమే అయితే నెలవారీ పెన్షన్ సుమారు రూ.3,214కు పరిమితమవుతుంది.

అంటే వేతనంతో పాటు పెన్షనబుల్ సర్వీస్ కాలం కూడా పెన్షన్ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది.

20 ఏళ్ల సర్వీస్ దాటితే అదనపు వెయిటేజ్

ఉద్యోగి కనీసం 20 సంవత్సరాల పెన్షనబుల్ సర్వీస్ పూర్తి చేసి రిటైర్ అయితే మరో ప్రయోజనం ఉంటుంది.

అలాంటి వారికి పెన్షనబుల్ సర్వీస్‌కు అదనంగా రెండు సంవత్సరాల వెయిటేజ్ లభిస్తుంది.

ఈ అదనపు వెయిటేజ్ సర్వీస్ కాలాన్ని పెంచి, చివరకు లభించే పెన్షన్ మొత్తాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుంది.

ADVERTISEMENT

వివరాలు 

రూ.15,000 వేతన పరిమితి

ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈపీఎస్ పెన్షన్ లెక్కింపులో ప్రామాణిక పెన్షనబుల్ వేతన పరిమితి నెలకు రూ.15,000గా ఉంది.

అయితే హయ్యర్ పెన్షన్‌కు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి.

ఈ రూ.15,000 పరిమితిని ఆధారంగా తీసుకుంటే, గరిష్ఠంగా 35 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగికి నెలకు రూ.7,500 వరకు పెన్షన్ లభించే అవకాశం ఉంటుంది.

రూ.15,000 × 35 ÷ 70 = రూ.7,500

ADVERTISEMENT

వివరాలు 

జీతం లేని కాలాన్ని ఎలా పరిగణిస్తారు?

ఉద్యోగి సర్వీస్ సమయంలో అనధికారికంగా సెలవులో ఉండటం లేదా వేతనం అందని రోజులు ఉండటం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు.

ఇలాంటి నాన్-కాంట్రిబ్యూటరీ పీరియడ్స్‌ను లెక్కలోకి తీసుకోరు. వేతనం పొందిన, సంబంధిత కాంట్రిబ్యూషన్ ఉన్న కాలాన్నే పరిగణనలోకి తీసుకుంటారు.

మొత్తంగా చూస్తే..

ఈపీఎస్ పెన్షన్‌ను నిర్ణయించడంలో ఉద్యోగి సర్వీస్ కాలంతో పాటు ఉద్యోగ జీవితంలోని చివరి దశలో పొందే వేతనం కూడా ముఖ్యమైన అంశం.

ముఖ్యంగా రిటైర్మెంట్‌కు ముందు ఐదేళ్లలో వచ్చే ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల ద్వారా జీతం పెరగడం పెన్షన్ గణనపై ప్రభావం చూపుతుంది.

అలాగే నిరంతర సర్వీస్ కూడా పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను బలోపేతం చేయడంలో కీలకంగా ఉంటుంది.

ADVERTISEMENT