Page Loader
Shashi Ruia: ఎస్సార్‌ గ్రూప్‌ సహ వ్యవస్థాపకుడు శశి రుయా కన్నుమూత 
ఎస్సార్‌ గ్రూప్‌ సహ వ్యవస్థాపకుడు శశి రుయా కన్నుమూత

Shashi Ruia: ఎస్సార్‌ గ్రూప్‌ సహ వ్యవస్థాపకుడు శశి రుయా కన్నుమూత 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 26, 2024
02:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎస్సార్ గ్రూప్‌ సహ వ్యవస్థాపకుడు శశి రుయా (81) మంగళవారం వృద్ధాప్య కారణాలతో మరణించారు. ఆయన మరణవార్తపై ఎస్సార్‌ గ్రూప్‌ అధికారికంగా సంతాపం ప్రకటించింది. శశికాంత్‌ రుయా మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నామని, సమాజ అభివృద్ధికి ఆయన చూపిన నిబద్ధత చిరస్మరణీయమైందని పేర్కొంది. లక్షలాది మందికి ఉపాధి కల్పించి వారి జీవితాల్లో మార్పును తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని ఎస్సార్ గ్రూప్‌ ప్రకటనలో తెలిపింది. 1943లో జన్మించిన శశి రుయా, తన సోదరుడు రవి రుయాతో కలిసి 1969లో ఎస్సార్‌ గ్రూప్‌ను స్థాపించారు. సంస్థ తొలి ప్రాజెక్ట్‌ మద్రాస్‌ పోర్ట్‌ ట్రస్ట్‌ ఔటర్‌ బ్రేక్‌వాటర్‌ నిర్మాణం, రూ.2.5 కోట్ల వ్యయంతో ప్రారంభమై విజయవంతమైంది.

Details

రాజకీయ ప్రముఖుల సంతాపం

ఈ ప్రాజెక్ట్‌తో ఎస్సార్‌ గ్రూప్‌ అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఈ విజయంతో మౌలిక సదుపాయాల నిర్మాణంలో ఎస్సార్ గ్రూప్‌ అనేక ప్రాజెక్టులు చేపట్టింది. డబుల్ బ్రిడ్జీలు, పవర్ ప్లాంట్‌లు, భారీ వంతెనల నిర్మాణం వంటి ప్రధాన మౌలిక నిర్మాణాలలో చురుకుగా పాల్గొంది. 1980లలో ఇంధన రంగంలోకి ప్రవేశించి చమురు, గ్యాస్ ఆస్తులను కొనుగోలు చేసింది. 1990లలో స్టీల్‌, టెలికమ్యూనికేషన్స్‌ రంగాలకు విస్తరించింది. శశి రుయా వ్యాపారదూరదృష్టి, నిబద్ధత ఎస్సార్ గ్రూప్‌ను భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే స్థాయికి తీసుకెళ్లింది. ఆయన మరణవార్తపై పలువురు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు సంతాపం తెలియజేశారు.